News February 7, 2025
NRML: రిక్రూట్మెంట్ ఫౌండేషన్ కోర్సులకు ఉచిత శిక్షణ

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డిగ్రీ ఉత్తీర్ణులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్థులకు రిక్రూట్మెంట్ ఫౌండేషన్ కోర్సులకు ఉచిత అందించనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి పురుషోత్తం తెలిపారు. ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే 4 నెలల ఉచిత శిక్షణలో అభ్యర్థులకు బుక్ ఫండ్, ప్రతి నెల స్టైఫండ్ ఇస్తామన్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 9 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News December 4, 2025
11వ తేదీ కడప మేయర్ ఎన్నిక జరగకపోతే?

కడప మేయర్ ఎన్నికకు <<18470673>>నోటిఫికేషన్<<>> విడుదలైన విషయం తెలిసిందే. ఈ నెల 11న ఉదయం 11 గంటలకు ఎన్నిక నిర్వహిస్తున్నట్లు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్ని పేర్కొన్నారు. ఒకవేళ 11వ తేదీ ఎన్నిక జరగకపోతే.. రిజర్వ్ డే (12వ తేది)న ఎన్నిక ఉంటుందని స్పష్టం చేశారు. అప్పటికీ ఎన్నిక జరగకుంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ తర్వాతి తేదీని వెల్లడిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
News December 4, 2025
ఖమ్మం: ఏపీ సీఎం సతీమణి వాహానం తనీఖీ

పంచాయతీ ఎన్నికల్లో భాగంగా అధికారులు తనిఖీలను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఖమ్మం జిల్లా నాయికన్ గూడెం చెక్ పోస్టు వద్ద ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వాహనాన్ని తనీఖీ చేశారు. హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తుండగా ఆమె వాహనాన్ని తనీఖీ చేశారు. ఆమె వెళ్తున్న వివరాలను అధికారులు నోట్ చేసుకున్నారు.
News December 4, 2025
ADB: అధికారులు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేయాలి

గ్రామపంచాయతీ ఎన్నికలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అధికారులను ఆదేశించారు. సమావేశం అనంతరం జిల్లా అధికారులతో ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా సమావేశం నిర్వహించారు. ఆర్వో స్టేజ్ 2 జోనల్ అధికారులు వెంటనే పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లే రోడ్డు మార్గాలను పరిశీలించాలని వివరించారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి ఉన్నారు.


