News December 7, 2025

NRML: ఎన్నికల నిర్వహణలో లోపాలు ఉండకూడదు: కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి లోటుపాట్లు జరగకూడదని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఎన్నికల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నామినేషన్ల అప్పీళ్లకు సంబంధించిన వివరాలను, మూడు దశల్లో దాఖలైన అన్ని నామినేషన్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Similar News

News April 3, 2026

BREAKING NEWS: పేర్ని కిట్టుపై కేసు నమోదు

image

మచిలీపట్నం నియోజకవర్గ YCP ఇన్‌ఛార్జ్<<19544536>> పేర్ని కిట్టుపై<<>> చిలకలపూడి PSలో కేసు నమోదైంది. గురువారం ఉదయం కొబ్బరితోటలో ఓ అక్రమ భవన నిర్మాణం జరుగుతున్న సమయంలో తన విధులకు ఆటంకం కల్పించడమే కాకుండా బెదిరించేలా మాట్లాడారని ఇనగుదురుపేట సీఐ పరమేశ్వరరావు ఫిర్యాదు చేశారు. సీఐ ఫిర్యాదు మేరకు పేర్ని కిట్టుపై BNS 132, 351(2) రెడ్ విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

News April 2, 2026

నిజామాబాద్: విజయవంతమైన గ్రామ, వార్డు సభలు

image

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో 545 గ్రామపంచాయతీలు,146 వార్డుల్లో నిర్వహించిన గ్రామ, వార్డు సభలు విజయవంతమయ్యాయి. కలెక్టర్ ఇలా త్రిపాఠి పర్యవేక్షణలో నిర్వహించిన ఈ సభల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు విస్తృతంగా పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేసి, అవసరమైన సౌకర్యాలు కల్పించారు.