News April 14, 2025
NRML: ఒకే ప్రాంతం.. 4 యాక్సిడెంట్లు

నర్సాపూర్ మండలంలోని తురాటీ, చాక్పల్లి గ్రామాల వద్ద ఉన్న హైవే 61 రహదారిపై నిర్మించిన స్పీడ్ బ్రేకర్లు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. గత 21 రోజుల్లో ఒకేచోట నాలుగు ప్రమాదాలు జరిగాయి. అందులో ఇద్దరు మరణించగా మిగతా మరో ఇద్దరు తీవ్ర గాయాలతో హాస్పటల్ పాలయ్యారు. అధికారులు స్పందించి స్పీడ్ బ్రేకర్లను తొలగించాలని గ్రామస్థులు, ప్రయాణికులు కోరుతున్నారు.
Similar News
News February 22, 2026
మెదక్: హాజరుకానున్న 12,334 మంది విద్యార్థులు: డీఐఈవో

మెదక్ జిల్లాలో ఈనెల 25 నుంచి జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి మాధవి తెలిపారు.
మొత్తం విద్యార్థులు -12,334
ఫస్ట్ ఇయర్ జనరల్ -5710
ఫస్ట్ ఇయర్ ఒకేషనల్ -599
మొత్తం -6309
సెకండ్ ఇయర్ జనరల్ -5472
సెకండ్ ఇయర్ ఒకేషనల్- 533
మొత్తం-6025
పరీక్ష కేంద్రాలు -28
ఫ్లైయింగ్ స్క్వాడ్ -5
సిట్టింగ్ స్క్వాడ్ -4
News February 22, 2026
నాసా మూన్ మిషన్ వాయిదా!

చంద్రుడిపైకి మనుషులను పంపే నాసా ‘ఆర్టెమిస్-2’ ప్రయోగం వాయిదా పడినట్లే! మార్చి 6న జరగాల్సిన ఈ మిషన్‌లో కొత్తగా హీలియం లీకేజీ తలెత్తింది. దీంతో భారీ SLS రాకెట్‌ను లాంచ్ ప్యాడ్ నుంచి తిరిగి హ్యాంగర్‌కు తరలించనున్నారు. ఇంధన ట్యాంకుల ప్రెజర్‌కు అవసరమైన హీలియం ఫ్లోలో అంతరాయమే దీనికి కారణం. టెక్నికల్ ఇష్యూస్‌ను సరిదిద్దేందుకు టైమ్ పడుతుండటంతో మార్చిలో ఈ ప్రయోగం జరిగే అవకాశం లేదని నాసా తెలిపింది.
News February 22, 2026
కర్నూలులో జిల్లాలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు

కర్నూలు జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలపై పోలీసులు అవగాహన కల్పించారు. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 21వ తేదీ వరకు 810 ఓవర్ స్పీడ్, 642 హెల్మెట్ లేని కేసులు నమోదయ్యాయని ఎస్పీ తెలిపారు. 270 సెల్ ఫోన్ డ్రైవింగ్, 1,187 డ్రంక్ అండ్ డ్రైవింగ్, 2,137 ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదయ్యాయన్నారు.


