News March 16, 2025
NRML: గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలు

2025-26 విద్యాసంవత్సరానికి జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల్లో 6,7,8,9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 6వ తరగతి ప్రవేశానికి 31 ఆగస్టు 2025 నాటికి విద్యార్థులకు 12 ఏళ్లకు మించకూడదన్నారు. SC, ST విద్యార్థులకు రెండేళ్లు సడలింపు ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 31లోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News March 16, 2025
NGKL: అయ్యో పాపం.. చిన్నారి మృతి

బల్మూరు మండలం చిన్నారి సంపులో పడి మృతిచెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. కొండనాగులకి చెందిన చింత మహేశ్, సుస్మిత దంపతులకు చిన్నారి నాన్సీ(2) ఉంది. ఆడుకుంటూ పక్కింటికి వెళ్లింది. చిన్నారిని ఎవరూ గమనించకపోవటంతో ఇంటి ఎదుట ఉన్న సంపులో పడింది. కొంత సేపటికి గమనించిన కుటుంబసభ్యులు చిన్నారిని బయటికి తీయగా అప్పటికే మృతిచెందింది.
News March 16, 2025
హుజూర్‌నగర్‌లో నలుగురు నకిలీ ఎస్ఐలు అరెస్ట్

నలుగురు యువకులు గోల్డ్ షాప్ యజమానిని బెదిరించిన ఘటన HNRలో జరిగింది. పోలీసుల వివరాలు.. NLG జిల్లా నిడమనూరుకు చెందిన ప్రశాంత్, అక్షిత్, NLGకు చెందిన ఇరాన్, వాజిద్ APలోని కుప్పం SI డీపీని పెట్టుకున్నారు. HNRలో గోల్డ్ షాపు యజమానికి కాల్ చేసి నువ్వు దొంగల నుంచి గోల్డ్ కొన్నావు, జైలుకు పంపుతామని బెదిరించగా అతను భయపడి రూ.10 వేలు పంపాడు. అనుమానం వచ్చి ఫిర్యాదు చేయగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు.
News March 16, 2025
వరంగల్ జిల్లాలో చికెన్ ధరలు ఇలా

వరంగల్ జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. చికెన్(విత్ స్కిన్) కేజీ రూ.160-180 ఉండగా.. స్కిన్‌లెస్ కేజీ రూ.200 ధర పలుకుతోంది. అలాగే లైవ్ కోడి రూ.120-130 మధ్య ఉంది. కాగా, బడ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో గత నెల క్రితం భారీగా అమ్మకాలు పడిపోగా.. ప్రస్తుతం అమ్మకాలు పెరగాయని, ధర సైతం పెరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు.