News March 27, 2025
NRML: డీసీసీ అధ్యక్షురాలిగా మళ్లీ శ్రీహరిరావు..?

కాంగ్రెస్ TG ఇన్‌ఛార్జ్ మీనాక్షి పార్టీ కార్యకలాపాలపై ఫోకస్ పెట్టారు. నిన్న ఢిల్లీలో DCCలతో భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా BRS అభ్యర్థులు పార్టీలో చేరినా.. సపరేట్ కేడర్ ఉన్నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామని ఆరా తీశారు. జిల్లాల్లో పార్టీని అన్నిస్థాయుల్లో ప్రక్షాళనపై చర్చించినట్లు తెలిసింది. అయితే DCC పదవి మళ్లీ శ్రీహరిరావుకే కట్టబెడతారా.. లేక ఇతరులకు ఇస్తారా అనేది తేలాల్సి ఉంది.
Similar News
News February 22, 2026
బుల్లెట్ తగిలినా తగ్గలేదు!

జమ్మూకశ్మీర్ కిష్త్వార్ జిల్లాలో ఇవాళ జరిగిన ఎన్‌కౌంటర్‌లో టైసన్ అనే శునకం ధైర్యసాహసాలు ప్రదర్శించింది. దాని సహాయంతో పోలీసులు, భద్రతా దళాలు జైషే మహమ్మద్ ఉగ్రమూకలను గుర్తించగలిగారు. ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో టైసన్ గాయపడింది. అయినా ఓర్పుతో మిషన్ పూర్తయ్యేవరకు సేవలు అందించింది. గాయపడిన శునకాన్ని హెలికాప్టర్‌లో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
News February 22, 2026
రేపు టీజీ పీజీఈసెట్- 2026 నోటిఫికేషన్

రాష్ట్రంలోని ఎం.టెక్, ఎం.ఫార్మసీ వంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జేఎన్టీయూ నేతృత్వంలో TG PGECET- 2026 నోటిఫికేషన్ సోమవారం విడుదల కానుంది. ఫిబ్రవరి 27న ఉ.11:30 గంటల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని కన్వీనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు https://pgecet.tgche.ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.
News February 22, 2026
కర్నూలు: ”సీమను’ ఎడారిని చేసేందుకు చంద్రబాబు కుట్ర’

రాయలసీమలోని ఎత్తిపోతల పథకాలను నిలిపివేసి, ప్రాంతాన్ని ఎడారిగా మార్చాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీశ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం కర్నూలులో మాట్లాడారు. చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. తిరుమల వివాదం వల్ల వెంకన్న శాపంతో హెరిటేజ్ సంస్థకు రూ.2,770 కోట్ల నష్టం వాటిల్లిందని, షేర్ల విలువ భారీగా పడిపోయిందని ఆయన విమర్శించారు.


