News September 21, 2025
NRML: ‘బతుకమ్మ, బాసర నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి’

నిర్మల్ జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి 30 వరకు జరగనున్న బతుకమ్మ, దసరా ఉత్సవాల కోసం జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. బాసరలో నవరాత్రి ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో అన్ని వసతులు కల్పిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
Similar News
News September 21, 2025
రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి: భట్టి

TG: రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని Dy.CM భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. వేయి స్తంభాల గుడి వద్ద బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ‘రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ ప్రారంభమైంది. మహిళలంతా ఆర్థికంగా, శక్తిమంతులుగా ఎదగాలి’ అని అన్నారు. అంతకుముందు కాకతీయ నృత్య నాటకోత్సవం ఆధ్వర్యంలో ప్రదర్శించిన సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మపై రూపొందించిన నృత్య నాటకాన్ని తిలకించారు.
News September 21, 2025
సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చర్యలు: ఎస్పీ

పుట్టపర్తి ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో రాజకీయ పార్టీలపైన కానీ, కులమతాల పైనగాని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. అలాంటి వారిపై కేసులు పెట్టి జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఈ మేరకు కదిరికి చెందిన అంజాద్ ఖాన్ అనే వ్యక్తిని అరెస్టు చేశామన్నారు. ఆయనపై ఐదు కేసులు నమోదు చేసి జైలుకు పంపామని తెలిపారు.
News September 21, 2025
గుత్తివారిపల్లిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

రేణిగుంట మండలం గుత్తివారిపల్లి గ్రామ సచివాలయం సమీపంలోని పొలాల్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. నీలం రంగు బనియన్, బ్లూ జీన్స్ ధరించి ఉన్నాడని, శరీరంపై గాయాలు లేవని, మద్యం అధికంగా సేవించడం వల్ల డీహైడ్రేషన్ లేదా అనారోగ్యం కారణమై ఉండవచ్చని రేణిగుంట అర్బన్ పోలీసులు అనుమానిస్తున్నారు. వయసు 25 నుంచి 30 ఏళ్ల ఉండొచ్చు అని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.