News February 16, 2025

 NRML: రాష్ట్రాలు దాటొచ్చిన ఎడారి ఓడ

image

రాజస్థాన్ రాష్ట్రం నుంచి ఓ కుటుంబం తమ బతుకుదెరువు కోసం ఒంటెలను తెలంగాణ నిర్మల్ జిల్లా భైంసా నుంచి బాసరకు నాలుగు ఒంటెలను తీసుకొని వచ్చారు. అటుగా వెళుతున్న ప్రయాణికులు కొంతమంది ఒంటెలను చూసి ఎంత బాగున్నాయంటూ స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. ఎక్కడ నుంచి వస్తున్నారని వారిని కొందరు పలకరించగా రాజస్థాన్ నుంచి పొట్టకూటి కోసం, ఒంటెల మేత కోసం ఇక్కడికి వచ్చినట్లు ఒంటెల కాపర్లు తెలిపారు.

Similar News

News December 15, 2025

ఇంధన పొదుపే అభివృద్ధికి మూలం: కలెక్టర్ శ్యాం ప్రసాద్

image

భవిష్యత్ తరాలకు సుస్థిరమైన జీవన విధానం అందించాలంటే ప్రతి ఒక్కరూ ఇంధన పొదుపును తమ జీవితంలో భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ పిలుపునిచ్చారు. సోమవారం పుట్టపర్తిలోని సత్యమ్మ గుడి వద్ద జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఈ నెల 20 వరకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను నిర్వహిస్తామన్నారు

News December 15, 2025

DRDO-DGREలో జూనియర్ రీసెర్చ్ ఫెలోలు

image

DRDO ఆధ్వర్యంలోని డిఫెన్స్ జియో ఇన్ఫర్మేటిక్స్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్(<>DGRE<<>>) 15 జూనియర్ రీసెర్చ్ ఫెలో, రీసెర్చ్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 29, 30 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరు కావొచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఎంఈ, ఎంటెక్, బీఈ, బీటెక్, నెట్, గేట్, ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులు అర్హులు. వెబ్‌సైట్: https://www.drdo.gov.in

News December 15, 2025

బెంగాల్‌లో 58 లక్షల ఓట్ల తొలగింపు!

image

బెంగాల్‌లో SIR ప్రక్రియ ముగియడంతో ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణను EC ప్రారంభించింది. రేపు డ్రాఫ్ట్ లిస్ట్‌ను ప్రజలకు అందుబాటులో ఉంచనుంది. రాష్ట్రంలో 7.66కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. SIRలో భాగంగా 58.2 లక్షల ఓట్లను తొలగించినట్లు సమాచారం. 31.39 లక్షల మంది విచారణకు హాజరుకానున్నట్లు EC స్టేటస్ రిపోర్టు ద్వారా తెలుస్తోంది. మరో 13 లక్షలకు పైగా ASD(ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్&డూప్లికేట్ ఓటర్స్)లను గుర్తించారు.