News April 25, 2025
NRML: వడదెబ్బకు ఏడుగురి మృతి

ఉమ్మడి ADB జిల్లా అగ్నిగుండంలా మారింది. రోజురోజుకు పెరుగుతున్న ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొన్ని మండలాల్లో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వారం రోజుల్లో నిర్మల్ జిల్లాలో ముగ్గురు, మంచిర్యాల జిల్లాలో ఇద్దరు, ఆసిఫాబాద్‌లో ఒకరు, ఆదిలాబాద్‌లో ఒకరు చొప్పున మృతిచెందారు. అనధికారికంగా సంఖ్యల ఎక్కువే ఉండొచ్చు. జాగ్రత్తలు పాటించండి. బయట తిరగొద్దు. నీరు అధికంగా తాగండి.
Similar News
News April 25, 2025
మే 22 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షలు: DIEO

ఇంటర్ ఫెయిలైన, ఇంప్రూవ్‌మెంట్ రాసుకునే విద్యార్థులకు మే 22 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా ఇంటర్ బోర్డు అధికారి దస్రూ నాయక్ తెలిపారు. రోజూ 2 పూటల పరీక్ష ఉంటుందన్నారు. ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 3 నుంచి 6వ తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపారు. అయితే అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులు ఈనెల 30 వరకు పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు.
News April 25, 2025
పెళ్లి శుభలేఖపై మహేశ్ బాబు ఫొటో!

సినీ హీరోలపై అభిమానాన్ని వారి ఫ్యాన్స్ వివిధ రకాలుగా చూపిస్తుంటారు. కర్నూలుకు చెందిన ఓ మహేశ్ బాబు ఫ్యాన్ తన పెళ్లి శుభలేఖపై సూపర్ స్టార్ ఫొటోను ముద్రించి తన ఇష్టాన్ని చాటుకున్నారు. శుభలేఖ కవర్‌పై దేవుడి ఫొటోల కింద మహేశ్ ఫొటోను ముద్రించారు. అతడు దీన్ని నెట్టింట పంచుకోగా మహేశ్ అభిమానులు వైరల్ చేస్తున్నారు.
News April 25, 2025
గద్వాల: యువకుడి ఆత్మహత్య.. కేసు నమోదు

యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గద్వాల జిల్లా ఉండవెల్లి PS పరిధిలో జరిగింది. SI మహేశ్ తెలిపిన వివరాలు.. బొంకూరు గ్రామ వాసి K.మధు(34) బయటకు వెళ్లి వస్తానని భార్యకు చెప్పి వెళ్లాడు. అనంతరం తనకు తెలిసిన వ్యక్తి రాముడికి ఫోన్ చేసి ‘మా తాతల ఆస్తి నాకు సరిగా పంచలేదు.. అందుకే పొలం వద్ద పురుగు మందు తాగి చనిపోతున్నా’ అని చెప్పాడు. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడు. కేసు నమోదైంది.