News November 23, 2025

NRML: వెడ్మ బొజ్జు పటేల్‌కు పెద్దపీట

image

నిర్మల్ కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షుడిగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ నియమితులయ్యారు. ఆదివాసీ నేతగా ఏజెన్సీ ప్రాంత సమస్యలపై బొజ్జు పటేల్ అనేక ఉద్యమాలు చేశారు. టీపీసీసీ కార్యదర్శిగా ఉన్నప్పుడే పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ ఖానాపూర్ నియోజకవర్గంలోనే కాక ఉమ్మడి జిల్లాలో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం, పోరాటపటిమ ఆయనకు పదవి రావడానికి కారణం.

Similar News

News November 23, 2025

పత్తి రైతులకు తప్పని యాప్ కష్టాలు

image

పండించిన పంటను అమ్ముకోవడానికి ఇన్ని యాప్‌లలో నమోదుకు చేసుకోవాలా? అని కొందరు పత్తి రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పంట వేశాక ఈ-క్రాప్‌లో నమోదు చేసుకోవాలి. లేకుంటే పంట కొనరు. పంట చేతికొచ్చాక అమ్మడానికి రైతుసేవా కేంద్రంలో సీఎం యాప్‌లో నమోదు చేసుకోవాలి. తర్వాత CCIకి చెందిన కపాస్ యాప్‌లో నమోదు చేసుకోవాలి. ఈ మూడూ అనుసంధానమైతేనే పత్తిని రైతులు అమ్ముకోగలరు. ఈ విధానం రైతులకు ఇబ్బందిగా మారింది.

News November 23, 2025

పెదవులు నల్లగా మారాయా?

image

రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవటం, ఒత్తిడి, స్మోకింగ్ వంటి వాటివల్ల పెదాలు నలుపు రంగులోకి మారుతుంటాయి. హైపర్ పిగ్మెంటేషన్, మెలస్మా కూడా కొన్నిసార్లు కారణమవుతుందంటున్నారు నిపుణులు. కొబ్బరినూనె, తేనె, చక్కెర కలిపి పెదాలకు ప్యాక్ వేసి స్కబ్ చేయాలి. అలాగే పాలు, పసుపు ప్యాక్ వేయడం వల్ల కూడా పెదాల రంగు మారుతుంది. అలోవెరా జెల్, రోజ్​ వాటర్, నెయ్యి, స్ట్రాబెర్రీ వంటివి పెదాలకు అప్లై చేసినా ఫలితం ఉంటుంది.

News November 23, 2025

కొత్తగూడెం: పశువుల అక్రమ రవాణా గుట్టు రట్టు

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పట్టపగలే పశువుల అక్రమ తరలింపు బహిర్గతమైంది. మణుగూరు నుంచి కొత్తగూడెం ప్రాంతానికి టాటా ఏసీ వాహనంలో 10కి పైగా ఆవులను ఇరుకుగా ఎక్కించి రవాణా చేస్తుండగా, లోడు ఎక్కువై అంబేడ్కర్ సెంటర్ వద్ద వాహనం ఆగిపోయింది. దీంతో అక్రమ రవాణా గుట్టు రట్టయింది. అప్రమత్తమైన అధికారులు వెంటనే వాహనాన్ని సీజ్ చేసి, వివరాలు సేకరిస్తున్నారు.