News March 14, 2025
NRML: హాల్ టికెట్లు వచ్చేశాయ్..!

డా.బీ.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబందించిన సెమిస్టర్-1 హాల్ టికెట్లు బుధవారం విడుదల అయ్యాయని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.సుధాకర్, అధ్యయన కేంద్రం సమన్వయకర్త డా.గంగాధర్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులు యూనివర్సిటీ వెబ్‌సైట్(www.braou.online) సందర్శించాలని సూచించారు. ఇప్పటికే అభ్యర్థులకు రిజిస్టర్ ఫోన్ నంబర్లకు మేసేజ్‌లు పంపినట్లు తెలిపారు.
Similar News
News December 15, 2025
కూతురు సర్పంచ్.. తండ్రి ఉపసర్పంచ్..

TG: జనగామ జిల్లా వెంకిర్యాల గ్రామంలో కూతురు సర్పంచ్, తండ్రి ఉపసర్పంచ్‌గా ఎన్నికయ్యారు. బీజేపీ బలపరిచిన గొల్లపల్లి అలేఖ్య సర్పంచ్‌గా గెలిచారు. ఉపసర్పంచ్ ఎన్నికలో వార్డు సభ్యులు కాంగ్రెస్, BRS అభ్యర్థులకు సమానంగా మద్దతు తెలపడంతో సర్పంచ్ అలేఖ్య తన ఓటును తండ్రి పర్శయ్య (BRS మద్దతుదారు)కు వేశారు. దీంతో ఆయన ఉప సర్పంచ్‌గా విజయం సాధించారు.
News December 15, 2025
సూర్యాపేట: ముగిసిన ప్రచారం.. ఎల్లుండి భవిత్యం

సూర్యాపేట జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ఏడు మండలాల్లో జరగనున్నాయి. ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రం 5 గంటలతో ముగిసింది. మొత్తం 146 గ్రామ పంచాయతీలకు గాను 22 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఈనెల 17న 124 పంచాయతీల్లో జరిగే పోలింగ్‌లో ఇదే సమయానికి బరిలో ఉన్న అభ్యర్థుల భవిత్యం తేలనుంది.
News December 15, 2025
బిజినేపల్లి: వార్డు మెంబర్‌గా గెలిచి హఠాన్మరణం

బిజినేపల్లి మండలం వెంకటాపూర్ గ్రామంలో స్థానిక సంస్థ ఎన్నికల్లో వార్డు మెంబర్‌గా జుర్రు మహేశ్ యాదవ్(34) పోటీ చేసే విజయం సాధించారు. అర్ధరాత్రి హఠాత్తుగా మృత్యువాత పడటం గ్రామంలో విషాదం నింపింది. ఆయన మరణంపై కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.


