News February 22, 2025

NRML: 4ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం

image

ఉమ్మడి ADBజిల్లాలో యాక్సిడెంట్లు కలకలం రేపుతున్నాయి. MNCLజిల్లాలో జరిగిన 2 ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందగా.. నిర్మల్‌లో గాయపడి చికిత్స పొందుతూ ఒకరు మరణించారు. MNCLలో లారీ కారును ఢీకొన్న ఘటనలో పెళ్లి కుమారుడి మేనత్త మృతి చెందింది. హాజీపూర్‌లో జరిగిన యాక్సిడెంట్‌లో మహిళ మరణించగా..మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. నిర్మల్‌ జిల్లాలో కరెంట్ షాక్‌తో రైతు మృతిచెందారు. ఆయా కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.

Similar News

News September 13, 2025

NLG: మహిళా సంఘాలకు తక్కువ వడ్డీకే రుణాలు!

image

ఉమ్మడి NLG జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు నల్గొండ DCCB గుడ్ న్యూస్ చెప్పింది. వాణిజ్య బ్యాంకుల కంటే తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వనుంది. ఇప్పటివరకు మహిళా సంఘాలు తీసుకునే రుణాలపై వాణిజ్య బ్యాంకులు 11.5 శాతం నుంచి 12 శాతం వరకు ఒక్కో బ్యాంకు ఒక్కో రకంగా వడ్డీ వేస్తున్నాయి. అయితే మొదటిసారిగా డీసీసీబీ ఆయా సంఘాలకు 7 శాతం 10 శాతంలోపు వడ్డీకి రుణాలు అందించనుంది. కాగా జిల్లాలో 1,255 మహిళా సంఘాలున్నాయి.

News September 13, 2025

మెదక్: తైబజార్ వసూళ్లు రద్దుకు ఆదేశం

image

మెదక్ కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. మెదక్‌లో గిరిజన మహిళపై దురుసుగా ప్రవర్తించడం బాధాకరమని అన్నారు. మెదక్, రామాయంపేట మున్సిపాలిటీల్లో తైబజార్ రద్దు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. గిరిజన మహిళపై దురుసుగా ప్రవర్తించిన వ్యక్తి పైన కేసు నమోదు చేయాలని డీఎస్పీకి సూచించారు.

News September 13, 2025

భద్రాచలం: గోదావరి పుష్కరాలు.. CM కీలక నిర్ణయం..!

image

2026లో జరగబోయే గోదావరి పుష్కరాలపై అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న పుణ్యక్షేత్రాల వద్ద టెంపుల్ సెంట్రిక్ ఘాట్‌లను నిర్మించాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. సుమారు రెండు లక్షల మంది భక్తులు ఒకేసారి స్నానాలు చేసేందుకు వీలుగా శాశ్వత ఘాట్‌లను నిర్మించాలన్నారు.