News February 22, 2025
NRML: 4ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం

ఉమ్మడి ADBజిల్లాలో యాక్సిడెంట్లు కలకలం రేపుతున్నాయి. MNCLజిల్లాలో జరిగిన 2 ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందగా.. నిర్మల్‌లో గాయపడి చికిత్స పొందుతూ ఒకరు మరణించారు. MNCLలో లారీ కారును ఢీకొన్న ఘటనలో పెళ్లి కుమారుడి మేనత్త మృతి చెందింది. హాజీపూర్‌లో జరిగిన యాక్సిడెంట్‌లో మహిళ మరణించగా..మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. నిర్మల్ జిల్లాలో కరెంట్ షాక్‌తో రైతు మృతిచెందారు. ఆయా కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.
Similar News
News September 13, 2025
మంచిర్యాల జిల్లాలో 29.3 మి.మీ వర్షపాతం

గడిచిన 24 గంటల్లో మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 29.3మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నెన్నెల మండలంలో 89.6 వర్షపాతం నమోదు కాగా.. జన్నారంలో 19.8, దండేపల్లి 11.2, లక్షెట్టిపేట13, హాజీపూర్28.8, కాసిపేట77.6, తాండూర్18.2, భీమిని9.6, కన్నేపల్లి7.2, వేమనపల్లి30.4, బెల్లంపల్లి47.4, మందమర్రి58.2, మంచిర్యాల 24.2, నస్పూర్16.6, జైపూర్ 9.4, భీమారం 14.4, చెన్నూర్ 38.6, కోటపల్లిలో 23.8మి.మీ నమోదైంది.
News September 13, 2025
మేం ఏ జట్టునైనా ఓడిస్తాం: పాక్ కెప్టెన్

తమ ప్రణాళికలను పక్కాగా అమలు చేస్తే ఏ జట్టునైనా ఓడిస్తామని పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా అన్నారు. భారత్‌తో మ్యాచ్ గురించి ఎదురైన ప్రశ్నకు ఆయన ఇలా బదులిచ్చారు. ‘మా బౌలింగ్ అద్భుతంగా ఉంది. బ్యాటింగ్‌లో ఇంకా బెటర్ అవ్వాలి. ఇటీవల మా ఆటతీరు బాగుంది. ట్రై సిరీస్‌ను కూడా ఈజీగా విన్ అయ్యాం’ అని ఒమన్‌తో మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించారు. ఆసియా కప్‌లో దుబాయ్ వేదికగా రేపు భారత్, పాక్ తలపడనున్న విషయం తెలిసిందే.
News September 13, 2025
NLG: రజాకార్ల మారణకాండకు 79 ఏళ్లు

రజాకారులు సృష్టించిన మారణ హోమానికి సజీవ సాక్ష్యం వల్లాల గ్రామం. 1948 ఆగస్టు15 దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఏడాది తర్వాత శాలిగౌరారం మండలం వల్లాల ప్రభుత్వ పాఠశాలలో పది మంది విద్యార్థులు త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ఎగురవేస్తుండగా గ్రామంపై దండెత్తిన రజాకారులు అమానుష హత్యాకాండకు తెగబడ్డారు. పాఠశాల ప్రాంగణంలోనే పది మందిని తుపాకీతో కాల్చి చంపిన ఘటనకు 79 ఏళ్లు నిండాయి.