News October 9, 2025

NRML: 9 జడ్పీటీసీ, 75 ఎంపీటీసీలకు నేటి నుంచి నామినేషన్లు

image

జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ తొలివిడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటి (గురువారం) నుంచి ప్రారంభం కానుంది. ఈరోజు నుంచి ఎల్లుండి (అక్టోబర్ 11, 2025) వరకు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. తొలివిడతలో 9 జెడ్పీటీసీ, 75 ఎంపీటీసీ స్థానాలకు ఖానాపూర్, పెంబి, కడెం, దస్తురాబాద్, మామడ, లక్ష్మణచందా, నిర్మల్, సోన్, సారంగాపూర్ మండలాల్లో పోలింగ్ జరగనుంది.

Similar News

News October 9, 2025

BC రిజర్వేషన్లు: హైకోర్టులో వాదనలు ఇలా..

image

TG: BCలకు 42% రిజర్వేషన్లు కల్పించడంపై దాఖలైన పిటిషన్లపై HCలో విచారణ కొనసాగుతోంది. ప్రభుత్వం తరఫున AG సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. BC కులగణన చేయాలని క్యాబినెట్ నిర్ణయించిందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని చెప్పారు. డోర్‌2డోర్ సర్వేకు అన్ని పార్టీలూ మద్దతిచ్చినట్లు తెలిపారు. సర్కార్ నియమించిన సీనియర్ లాయర్ సింఘ్వీ వర్చువల్‌గా వాదిస్తున్నారు.

News October 9, 2025

గుత్తి విద్యార్థికి రూ.51లక్షల ప్యాకేజీతో ఉద్యోగం

image

గుత్తి పట్టణానికి చెందిన షేక్ బాషా, షేక్ రహమత్ బీ దంపతుల కుమారుడు షేక్ దాదా కలందర్ హైదరాబాదులోని బిట్స్ పిలానీ కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతున్నారు. గత నెల 26న కళాశాలలో జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూలో అత్యంత ప్రతిభ కనబరిచి ఏడాదికి రూ.51 లక్షల ప్యాకేజీతో AMD కంపెనీలో ఉద్యోగానికి ఎంపికయ్యారు. బీటెక్ అయిపోగానే జాబ్‌లో చేరనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కలందర్‌ను తోటి విద్యార్థులు అభినందించారు.

News October 9, 2025

రేపటి నుంచి వైద్య సేవలు బంద్

image

ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు మరోసారి నిలిచిపోనున్నాయి. ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడంతో రేపటి నుంచి సేవలు నిలిపివేస్తున్నట్లు నెట్‌వర్క్ ఆసుపత్రులు తెలిపాయి. ప్రభుత్వం నుంచి రూ.2,700 కోట్లు రావాలని పేర్కొన్నాయి. గత రెండు రోజులుగా ప్రజాప్రతినిధులను కలిశామని వెల్లడించాయి. తమ ఆందోళన కారణంగా సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నట్లు తెలిపాయి.