News March 19, 2025
NRML: SC వర్గీకరణ, BC రిజర్వేషన్ చారిత్రాత్మక నిర్ణయం: శ్రీహరిరావు

రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయడం చారిత్రాత్మక నిర్ణయమని డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు అన్నారు. బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలపడాన్ని హర్షిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
Similar News
News March 20, 2025
HYD: ఓయూ బంద్కు పిలుపు

ఓయూలో ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు నిషేధం అని అధికారులు విడుదల చేసిన సర్క్యూలర్పై వ్యతిరేకత పెరుగుతోంది. ఇటీవల ABVP బంద్కు పిలుపునివ్వగా ఎక్కడికక్కడ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. నేడు SFI, AISF, PDSU, PDSU(V)AIDSO, PSU సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. ఓయూ విద్యార్థుల గొంతులు నొక్కే అప్రజాస్వామిక సర్క్యూలర్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
News March 20, 2025
జనాభా కంటే ఫోన్లే ఎక్కువ

తెలంగాణ జనాభా కంటే ఫోన్ల సంఖ్యే ఎక్కువగా ఉందని బడ్జెట్ ద్వారా వెల్లడైంది. రాష్ట్రంలో 4.42 కోట్ల మొబైల్స్, 15.2 లక్షల ల్యాండ్ లైన్ ఫోన్లు ఉన్నాయి. ఇక రాష్ట్రంలో మొత్తం 1.71 కోట్ల వాహనాలు ఉన్నాయి. ఇందులో టూ వీలర్ల వాటా 73.52%. మిగతా కేటగిరీలో కార్లు, ఆటోలు, బస్సులు, మధ్య స్థాయి, భారీ రవాణా వాహనాలున్నాయి.
News March 20, 2025
చాగలమర్రిలో రాష్ట్రంలోనే అత్యధికం..!

నంద్యాల జిల్లాలో గత కొద్దిరోజులుగా భానుడు విలయ తాండవం ఆడుతున్నాడు. ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) గణాంకాల ప్రకారం బుధవారం నంద్యాల జిల్లా చాగలమర్రిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 42.3°C ఉష్ణోగ్రత నమోదవడం ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మార్చిలోనే 42.3°C ఉష్ణోగ్రత నమోదవుతుండటం గమనార్హం.