News April 21, 2025
NRML: TGSRTCలో జాబ్స్.. ప్రిపరేషన్‌కు READY

TGSRTCలో 3,038 పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి పొన్నం ప్రకటించడంతో నిర్మల్ జిల్లాలో నిరుద్యోగులు ప్రిపరేషన్‌కు రెడీ అవుతున్నారు. డ్రైవర్లు-2,000, శ్రామిక్-743, డిప్యూటీ సూపరింటెండెంట్(మెకానికల్-114, ట్రాఫిక్- 84), DM/అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ -25,అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్-18,సివిల్-23, సెక్షన్ ఆఫీసర్-11, అకౌంట్స్ ఆఫీసర్-6,మెడికల్ ఆఫీసర్స్ (జనరల్-7, స్పెషలిస్టు-7) పోస్టులు ఉన్నాయి.
Similar News
News April 21, 2025
కరీంనగర్: అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేడ్కర్ కృషి: బండి

భారతదేశ చరిత్రలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఎదుర్కొన్న అవమానాలు మరెవరూ ఎదుర్కోలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్ లో అన్నారు. ఎన్ని అవమానాలు ఎదురైనా, అడుగడుగునా హేళనకు గురైన వాటినే సోపానాలుగా చేసుకుంటూ అనుకున్న లక్ష్యానికి చేరుకోవడంతోపాటు తన చదువునంతా సమాజ శ్రేయస్సుకు, అణగారిన వర్గాల అభ్యున్నతికి ధారపోసిన మహనీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు.
News April 21, 2025
VJA ఆటోనగర్ లాడ్జీల్లో తనిఖీలు

విజయవాడ ఆటోనగర్‌లోని లాడ్జీల్లో శనివారం అర్ధరాత్రి పటమట పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తనిఖీలలో భాగంగా పేకాట ఆడుతున్న ఐదుగురిని, వ్యభిచారం చేస్తున్న ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పటమట పోలీసులు తెలిపారు.
News April 21, 2025
ఆటగాళ్ల కాంట్రాక్టులు ప్రకటించిన BCCI

BCCI ప్లేయర్ల కాంట్రాక్టులు ప్రకటించింది. రోహిత్, కోహ్లీ, బుమ్రా, జడేజా A+లోనే ఉన్నారు. గ్రేడ్Aలో సిరాజ్, రాహుల్, గిల్, పాండ్య, షమీ, పంత్, గ్రేడ్Bలో సూర్య, కుల్దీప్, జైస్వాల్, అక్షర్, శ్రేయస్ స్థానం దక్కించుకున్నారు. రింకూ, తిలక్, రుతురాజ్, శివమ్, బిష్ణోయ్, సుందర్, శాంసన్, అర్ష్‌దీప్, ముకేశ్, ప్రసిద్ధ్, రజత్, జురెల్, సర్ఫరాజ్, ఇషాన్, నితీశ్, అభిషేక్, ఆకాశ్, వరుణ్, హర్షిత్ గ్రేడ్Cలో ఉన్నారు.