News April 4, 2025
NRML: డిగ్రీ విద్యార్థులకు GOOD NEWS

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును KU అధికారులు పొడిగించిన విషయం తెలిసిందే. కాగా వీటితో పాటు 1, 3, 5 సెమిస్టర్ పరీక్షలు సైతం రాసేందుకు అవకాశం కల్పించినట్లు KU అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో 1, 3, 5 పరీక్ష ఫీజును ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈనెల 11 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News April 18, 2025
విజయవాడలో శవమై తేలిన భూపాలపల్లి మహిళ

భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలానికి చెందిన మహిళ విజయవాడలో శవమై తేలింది. KU ఎస్సై శ్రీకాంత్ వివరాలు.. భావుసింగ్‌పల్లి గ్రామానికి చెందిన స్రవంతి కుటుంబంతో కొంత కాలంగా HNK భీమారంలో ఉంటోంది. అయితే పెళ్లైన చాలా ఏళ్ల తర్వాత రెండు నెలల క్రితం ఆమెకు బాబు జన్మించాడు. అప్పటి నుంచి ఆమె మానసిక సమస్యతో బాధపడుతోంది. ఈనెల 15న ఇంట్లోంచి వెళ్లిపోయన స్రవంతి గురువారం విజయవాడ ప్రకాశం బ్యారేజీ(ఏపీ) వద్ద శవమై తేలింది.
News April 18, 2025
పిట్లం: చెరువుకట్ట వద్ద విగతజీవిగా కానిస్టేబుల్

పిట్లం మండలం సిద్దాపూర్ చెరువు కట్ట వద్ద శుక్రవారం ఉదయం ఓ కానిస్టేబుల్ విగతజీవిగా కనిపించాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఏస్ఐ రాజు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా, పిట్లం పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ బుచ్చయ్యగా గుర్తించారు. కాగా బుచ్చయ్య మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
News April 18, 2025
WGL: ఖుష్ మహల్ ప్రత్యేకత తెలుసా..?

ఓరుగల్లులోని చూడదగ్గ పర్యాటక ప్రాంతాల్లో ఖిలా వరంగల్ ఒకటి. ఇక్కడ చూసేందుకు అనేక ప్రదేశాలు ఉన్నప్పటికీ ఖుష్ మహల్ ప్రత్యేకం. 14వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఖుష్ మహల్ తుగ్లక్ పాలన కాలంలో నిర్మించారు. ఈ నిర్మాణంపై ఇప్పటికీ తుగ్లక్ నిర్మాణ శైలి జాడలు కనిపిస్తాయి. ఢిల్లీలోని ఘియాత్ అల్ దిన్ తుగ్లక్ సమాధి, ఖుష్ మహల్ మధ్య నిర్మాణ సారూప్యత ఉందని చరిత్రకారులు చెబుతుంటారు. ఈ కట్టడాన్ని చూశారా.. కామెంట్ చేయండి.