News April 12, 2025

NRML: మూడు రోజులే గడువు..APPLY NOW

image

రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని జడ్పీ సీఈఓ గోవింద్, మండల ఎంపీడీవో పుష్పలత సూచించారు. నర్సాపూర్(జి) మండలంలోని నందన్ గ్రామపంచాయతీలో పలువురు అధికారులు, గ్రామస్థులతో మాట్లాడారు. కులవృత్తులు చేసుకునే వారికి, నిరుద్యోగ యువతకు మేలు చేసే విధంగా ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేస్తుందని తెలిపారు. ఆసక్తి గలవారు ఏప్రిల్ 14 లోపు దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు.

Similar News

News December 15, 2025

విద్యార్థులకు వేడి ఆహారమే ఇవ్వాలి: మంత్రి

image

AP: చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని బీసీ హాస్టళ్లలోని విద్యార్థులకు తాజా, వేడి ఆహారం మాత్రమే అందించాలని బీసీ సంక్షేమ మంత్రి సవిత అధికారులను ఆదేశించారు. వేడి చేసి చల్లార్చిన నీటిని మాత్రమే ఇవ్వాలని, గదుల్లో దోమలు చొరబడకుండా తెరలు వాడాలని సూచించారు. వార్డెన్లు హాస్టల్లో భోజనాన్ని ముందుగా రుచి చూడాలని, ఆ తరువాత విద్యార్థులందరితో కలిసి భోజనం చేయాలని ఉన్నతాధికారుల సమీక్షలో తెలిపారు.

News December 15, 2025

NGKL: ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక

image

ఉమ్మడి MBNR జిల్లా క్రికెట్ టోర్నమెంట్‌కు క్రీడాకారుల ఎంపిక జరగనుందని HCA మహబూబ్‌నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ పేర్కొన్నారు. NGKL జిల్లా జట్టు ఎంపిక ఈనెల 18న నల్లవెల్లి రోడ్డులోని క్రికెట్ మైదానంలో నిర్వహించనున్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఆధార్, 2 పాస్‌పోర్ట్ ఫోటోలతో ఉ10 గంటల లోపు హాజరుకావాలని సూచించారు. ఎంపికైన క్రీడాకారులతో 22 నుంచి 26 వరకు లీగమ్యాచ్‌లు నిర్వహిస్తారని తెలిపారు.

News December 15, 2025

ఆస్తి కోసం వేధింపులు.. కొడుకుపై ఎస్పీకి వృద్ధురాలి ఫిర్యాదు

image

ఇందుకూరుపేటకు చెందిన ఓ వృద్ధురాలు సోమవారం ఎస్పీని కలిసి తన కుమారుడిపై ఫిర్యాదు చేశారు. తన ఇద్దరు కుమారులకు ఆస్తిని సమానంగా పంచి, తాను వేరుగా ఓ ఇంట్లో భర్తతో ఉంటున్నట్లు తెలిపింది. అయితే ఆ ఇంటిని కూడా ఇవ్వాలంటూ తన కొడుకు వేధిస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనను, తన భర్తను బెదిరిస్తూ మానసికంగా వేధిస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తమకు న్యాయం చేయాలని ఆ వృద్ధురాలు ఎస్పీని కోరారు.