News April 12, 2025

NRML: రాజీవ్ యువ వికాసానికి అప్లికేషన్లకు నెట్‌వర్క్ గండం

image

రాజీవ్ యువశక్తి ధరఖాస్తుల స్వీకరణకు నెట్‌వర్క్ గండం శాపంగా మారింది. గత గురువారం మధ్యాహ్నం 3 గంటలనుండి నెట్‌వర్క్ పని చేయటం లేదని, స్లోగా పనిచేయటంతో అప్లికేషన్ అప్‌లోడ్ కావటం లేదని లక్ష్మణచంద మండల మీ సేవా నిర్వాహకులు శుక్రవారం వాపోయారు. ఈ సమస్య వలన తహశీల్దారు కార్యలయంలో కూడా సర్టిఫికెట్ జారీ కావటంలేదని ఆశావాహులు ఆవేదన వ్యక్తం చేశారు. గడువును మళ్లీ పొడిగించాలని కోరుతున్నారు.

Similar News

News April 19, 2025

కూటమి వైఫల్యాలే వైసీపీకి శ్రీరామరక్ష : ధర్మాన

image

రాష్ట్రంలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వం వైఫల్యాలే వైసీపీకి శ్రీరామరక్షగా నిలుస్తాయని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణ దాస్ అన్నారు. శనివారం తాడేపల్లి కార్యాలయంలో జరిగిన రాష్ట్రస్థాయి సదస్సులో ఆయన పాల్గొన్నారు. లేనిపోని హామీలను గుప్పించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. గడిచి పది నెలలు పూర్తైనా నెరవేర్చలేకపోయారని విమర్శించారు.

News April 19, 2025

IPL: టాస్ గెలిచిన గుజరాత్

image

అహ్మదాబాద్‌లో మొదలుకానున్న GTvsDC మ్యాచ్‌లో గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పాయింట్స్ టేబుల్‌లో ఢిల్లీ అగ్రస్థానంలో, గుజరాత్ మూడో స్థానంలో ఉన్నాయి.
DC: పోరెల్, కరుణ్, కేఎల్, అక్షర్, స్టబ్స్, అశుతోశ్, విప్రాజ్, స్టార్క్, కుల్‌దీప్, ముకేశ్, మోహిత్
GT: సుదర్శన్, గిల్, బట్లర్, షారుఖ్, తెవాటియా, రషీద్, అర్షద్, సిరాజ్, కిశోర్, ప్రసిద్ధ్, ఇషాంత్

News April 19, 2025

కాజీపేట: మహిళా కానిస్టేబుల్ సూసైడ్

image

మహిళా కానిస్టేబుల్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. కాజీపేటలోని దర్గా ప్రాంతానికి చెందిన కానిస్టేబుల్ అర్చనకు 2022లో వివాహం జరిగింది. కొద్ది రోజులకే ఆమెకు భర్తతో విడాకులు కావడంతో మానసికంగా బాధపడింది. ఈ క్రమంలో ఆత్మహత్యకు పాల్పడింది.

error: Content is protected !!