News August 21, 2024

NRPT:బాల పురస్కార్ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం

image

చిన్నారులకు అందించనున్న ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుకు దరఖాస్తు చేసుకోవాలని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారి జయ తెలిపారు. ఈ నెల 31 వరకు గడువు ఉందన్నారు. ఐదేళ్ల-18 ఏళ్ల వయసులోపు ఉన్న బాల బాలికలు వివిధ ఆవిష్కరణలు, క్రీడలు, సామజిక సేవ, శాస్త్ర సాంకేతిక, పర్యావరణం, కళలు, సంస్కృతిక రంగాలలో ప్రతిభ కనబర్చిన వారు అర్హులన్నారు.awards.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Similar News

News January 7, 2026

MBNR: రేపు క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్

image

K12 టెక్నో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో HYD,MBNR బ్రాంచ్ కోసం PROలు, PRM ఖాళీలు ఉన్నాయని పీయూ పీజీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి.మధుసూదన్ రెడ్డి, ప్లేస్‌మెంట్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ ఎన్ అర్జున్ కుమార్ ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. ఈనెల 8న క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్” నిర్వహిస్తున్నామని, పీయూలో MBA,MCA పూర్తి చేసిన విద్యార్థులు అర్హులని, పూర్తి వివరాలకు 98494 45877కు సంప్రదించాలన్నారు.

News January 7, 2026

MBNR: సంక్రాంతి పండుగ.. NH-43 పై నిఘా..!

image

సంక్రాంతి పండగ సందర్భంగా రాష్ట్ర రాజధాని సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికుల రాకపోకలు అధికంగా ఉండనున్న నేపథ్యంలో మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి నేషనల్ హైవే–44 పరిధిలోని బాలానగర్ ఫ్లైఓవర్ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా బాలానగర్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కొనసాగుతున్న కారణంగా ప్రయాణికులకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.

News January 7, 2026

MBNR: పీఎంశ్రీ క్రీడా పోటీలు.. విజేతలు వీరే!

image

మహబూబ్ నగర్ జిల్లాలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించారు. వివరాలు ఇలా!!
✒ కబడ్డీ (బాలుర)
1st- బాదేపల్లి, 2nd- గార్లపాడు
✒ కబడ్డీ (బాలికల)
1st- బాలానగర్, 2nd- వాపుల
✒ వాలీబాల్ (బాలుర)
విజేత- బాదేపల్లి, రన్నర్‌గా- వేముల
✒ వాలీబాల్ (బాలికల)
విజేత- బాలానగర్ (గురుకుల), రన్నర్‌గా-సీసీ కుంట(KGBV)