News January 27, 2025
NRPT: ‘అధికారులు సమన్వయంతో పనిచేయాలి’

అన్ని శాఖల అధికారులందరూ సమన్వయంతో పనిచేసి జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్, అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ అన్నారు. సోమవారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అధికారులు, పోలీసులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఇసుక, రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవాలని అన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమ మానవ రవాణా జరగకుండా చూడాలన్నారు.
Similar News
News September 17, 2025
విశాఖ: పిల్లల ఉచిత శిక్షణా కార్యక్రమాలు పునఃప్రారంభం

VMRDA బాలల ప్రాంగణంలో పిల్లల కార్యక్ర మాలు సెప్టెంబర్ 21 నుంచి ప్రతి ఆదివారం పునఃప్రారంభమవుతాయని ఛైర్మన్ ఎం.వి.ప్రణవ్ గోపాల్, కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్ బుధవారం వెల్లడించారు. విద్యార్థులకు ఇంగ్లీష్, పబ్లిక్ స్పీకింగ్, సంగీతం, డ్రాయింగ్, సైన్స్, కథా విన్యాసం, ఆర్ట్ & క్రాఫ్ట్, క్విజ్, AI కోడింగ్, కాలిగ్రఫీ, మ్యాథ్స్, నటన వర్క్షాప్, కెరీర్ గైడెన్స్ వంటి విభాగాలలో ఉచిత శిక్షణ అందిస్తారు.
News September 17, 2025
GNT: CM ఏర్పాట్లను సమీక్షించిన కలెక్టర్

DSC నియామక పత్రాలు అందజేస్తున్న ప్రాంగణంలో ఏర్పాట్లను కలెక్టర్ తమీమ్ అన్సారియా బుధవారం సమీక్షించారు. ఈ నెల 19వ తేదీన రాష్ట్ర సచివాలయం దగ్గర DSCలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించే ప్రాంగణంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో SP వకుల్ జిందాల్, తెనాలి సబ్ కలెక్టర్ సంజన సిన్హా, గుంటూరు RDO శ్రీనివాస రావు, సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ తదితరులు ఉన్నారు.
News September 17, 2025
హైడ్రాలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

హైడ్రాలో ప్రజాపాలన దినోత్సవం ఘనంగా జరిగింది. కమిషనర్ ఏవీ రంగనాథ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ‘ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి. ప్రజల సాధకబాధకాలను అర్థం చేసుకుని సమస్యలను పరిష్కరించే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలి’ అని సూచించారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి జాతీయ జెండా ఆవిష్కరించారు.