News January 27, 2025
NRPT: ‘అధికారులు సమన్వయంతో పనిచేయాలి’

అన్ని శాఖల అధికారులందరూ సమన్వయంతో పనిచేసి జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్, అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ అన్నారు. సోమవారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అధికారులు, పోలీసులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఇసుక, రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవాలని అన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమ మానవ రవాణా జరగకుండా చూడాలన్నారు.
Similar News
News February 13, 2025
భద్రాద్రిలో విషాదం.. ఇద్దరి దుర్మరణం (UPDATE)

భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలం బైరాగులపాడు వద్ద లారీ, బైక్ ఢీకొన్న ఘోర <<15448249>>రోడ్డు ప్రమాదం<<>>లో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులు చింతగుప్ప పరిధిలోని సుజ్ఞానాపురం గ్రామానికి చెందిన భూక్యా హరిబాబు(40), భూక్యా సోమ్లా(36) లుగా గుర్తించారు. అకాల మరణంతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News February 13, 2025
రైతులకు 9 గంటల విద్యుత్ అందాల్సిందే: మంత్రి గొట్టిపాటి

AP: వేసవిలో విద్యుత్ కోతలు ఉండరాదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. రైతులకు 9 గంటల ఉచిత కరెంట్ అందాల్సిందేనని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా స్మార్ట్ మీటర్ల పరికరాల బిల్లులను చెల్లించారనే ఆరోపణలపై ఎస్పీడీసీఎల్ ఎండీ సంతోష్‌రావును వివరణ కోరారు. ఈ విషయంలో సీఎం అసంతృప్తిని ఎండీకి వివరించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా పనిచేయాలని సూచించారు.
News February 13, 2025
బాపట్ల: స్కానింగ్ సెంటర్లను నిరంతరం తనిఖీ చేయాలి

స్కానింగ్ సెంటర్లను వైద్యశాఖ అధికారులు నిరంతరం తనిఖీ చేయాలని బాపట్ల ఆర్డీవో గ్లోరియా చెప్పారు. గురువారం బాపట్ల ఆర్డీవో కార్యాలయం నందు సబ్ డిస్ట్రిక్ లెవల్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆడపిల్లల ప్రాధాన్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.