News January 30, 2025
NRPT: ఆకతాయిలు వేధిస్తే చట్టపరమైన చర్యలు: పోలీసులు

మహిళలను ఆకతాయిలు వేధిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని షీ టీమ్ పోలీసులు బాలరాజు, చెన్నయ్య అన్నారు. బుధవారం నారాయణపేట చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు షీ టీమ్ పై అవగాహన కల్పించారు. ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ చేయడం చట్టరీత్య నేరమని హెచ్చరించారు. ఎవరైనా ఆకతాయిలు వేధింపులకు గురి చేస్తే షీ టీమ్ పోలీసులకు నేరుగా లేదా 8712670398 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News November 12, 2025
VKB: ప్రజల భద్రత కోసమే తనిఖీలు: ఎస్పీ

ప్రజల భద్రత కోసమే ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. మంగళవారం వికారాబాద్లోని బస్టాండ్, రైల్వే స్టేషన్లు, ప్రధాన చౌరస్తాలలో డాగ్ స్క్వాడ్ బృందాలతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ఎక్కడైనా అనుమానితులు ఉంటే 100కు డయల్ చేయాలన్నారు.
News November 12, 2025
ఉదయాన్నే నిద్ర లేవాలని ఎందుకు చెబుతారు?

సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ సమయంలో నిద్రలేచే ప్రకృతిలోని సకల జీవచరాలు నిష్కల్మషంగా, నిస్వార్థంగా, అత్యంత సమయస్ఫూర్తి, అంకితభావంతో ఉంటాయని నమ్మకం. మనిషి కూడా అదే సమయంలో నిద్ర లేస్తే ఆ సుగుణాలు మనలోనూ అలవరతాయని విశ్వాసం. సూర్యోదయానికి ముందు లేస్తే పనులన్నీ త్వరగా పూర్తవుతాయి. లేకపోతే పనులు సకాలంలో పూర్తికావని కాకులు ‘కావ్.. కావ్..’ అంటూ మనకు చెబుతాయి. <<-se>>#Jeevanam<<>>
News November 12, 2025
అడుగున ఎరువుకొద్దీ పైన బంగారం

ఏ పొలానికైనా ఎరువులే బలం అని చెప్పేందుకు ఈ సామెతను ఉపయోగిస్తారు. పొలం పనులలో భూమికి ఎరువు వేయడం కష్టమైనా, సరైన ఎరువు ఫలితంగా బంగారంలాంటి పంట పండి మనకు సంతోషం కలుగుతుంది. అలాగే, కష్టపడి పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని ఈ సామెత చెబుతుంది.


