News February 16, 2025
NRPT: ఆర్డర్ కాపీలు అందుకున్న (2008) DSC అభ్యర్థులు

DSC 2008లో నష్టపోయిన అభ్యర్థులు ఎట్టకేలకు శనివారం రాత్రి అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీలను అందుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ZPCEO సౌభాగ్య లక్ష్మి, DEO గోవిందరాజులు సమక్షంలో ముందుగా అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలించారు. నారాయణపేట కలెక్టరేట్లో కలెక్టలో డీఈఓ గోవిందరాజు చేతుల మీదుగా ఉపాధ్యాయుల సంఘాలతో కలిసి 45 మంది 2008 DSC అభ్యర్థులు ఆర్డర్ కాపీలను అందుకున్నారు.
Similar News
News October 30, 2025
వరద బాధితులను పరామర్శించిన మంత్రి కొండా

మొంథా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరంగల్ జిల్లాలో అనేక ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ గురువారం ఎన్.ఎన్. నగర్లోని వరద బాధితులను పరామర్శించారు. అవసరమైన సహాయం అందేలా తక్షణ చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. ముంపు ప్రాంతాల్లో ఎవరూ ఇబ్బందులు పడకూడదని, ఆహారం, తాగునీరు, వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
News October 30, 2025
మేడిపల్లి: కులం పేరుతో దూషించి దాడి.. వ్యక్తికి జైలు

మేడిపల్లి మండలం కల్వకోటకి చెందిన గోడ వెంకటిపై కులం పేరుతో దూషించి దాడి చేసిన కేసులో అదే గ్రామానికి చెందిన ఆదె చందుకు ఏడాది జైలు శిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ కరీంనగర్ మూడో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి నీరజ తీర్పునిచ్చారు. 2020 జనవరి 21న బర్రెను ఢీకొట్టిన ఘటనపై మాటామాటా పెరిగి చందు వెంకటిని తిడుతూ దాడి చేశాడు. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను SP అశోక్ కుమార్ అభినందించారు.
News October 30, 2025
మంచిర్యాల: ‘తెలంగాణలో ఫసల్ బీమా అమలు చేయాలి’

జిల్లాలోని రైతులు అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయి ఆర్థికంగా చితికిపోతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు చివరి దశలో నష్టపోతుండటంతో కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా దక్కడం లేదని రైతులు వాపోతున్నారు. దీనితో ప్రతి సంవత్సరం అప్పుల పాలవుతున్నామని, తమను ఆదుకోవడానికి రాష్ట్రంలో తక్షణమే ఫసల్ బీమా యోజనను అమలు చేయాలని రైతన్నలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


