News February 16, 2025
NRPT: ఆర్డర్ కాపీలు అందుకున్న (2008) DSC అభ్యర్థులు

DSC 2008లో నష్టపోయిన అభ్యర్థులు ఎట్టకేలకు శనివారం రాత్రి అపాయింట్‌మెంట్ ఆర్డర్ కాపీలను అందుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ZPCEO సౌభాగ్య లక్ష్మి, DEO గోవిందరాజులు సమక్షంలో ముందుగా అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలించారు. నారాయణపేట కలెక్టరేట్‌లో కలెక్టలో డీఈఓ గోవిందరాజు చేతుల మీదుగా ఉపాధ్యాయుల సంఘాలతో కలిసి 45 మంది 2008 DSC అభ్యర్థులు ఆర్డర్ కాపీలను అందుకున్నారు.
Similar News
News March 7, 2026
31లోగా లక్ష ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం: పొంగులేటి

ఖమ్మం: ఈనెల 31వ తేదీలోగా రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు నిర్వహించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. మంజూరైన ప్రతి ఇళ్లు వెంటనే గ్రౌండింగ్ కావాలని, పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని స్పష్టం చేశారు. ఏప్రిల్‌లో రెండో విడత ఇళ్లు మంజూరు చేస్తామని, ఈలోగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.
News March 7, 2026
మహబూబాబాద్: పదో తరగతిలో 100% ఫలితాలే లక్ష్యం: కలెక్టర్

పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. శనివారం సమీక్ష నిర్వహించారు. వసతి గృహాల్లో విద్యార్థులకు కామన్ డైట్ మెనూను అమలు చేయాలన్నారు. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు, కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. విద్యార్థుల చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించడంతో పాటు, ర్యాగింగ్ జరగకుండా చూడాలన్నారు.
News March 7, 2026
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన NZB కలెక్టర్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లాలోని మహిళలందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని ఆమె పేర్కొన్నారు.
మహిళలు ప్రతి రంగంలోనూ తమ ప్రతిభను చాటుకుంటూ దేశ అభివృద్ధికి కీలకంగా మారుతున్నారన్నారు. మహిళలకు భద్రత, గౌరవం, సమాన అవకాశాలు కల్పించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ గుర్తు చేశారు.


