News February 25, 2025
NRPT: ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను విజయవంతం చేయాలి: కలెక్టర్

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించే ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఈనెల 24 నుంచి 29 వరకు జరిగే వారోత్సవాలను సందర్భంగా బ్యాంక్ అధికారులతో కలిసి వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. ‘ఆర్థిక అక్షరాస్యత ఐశ్వర్యానికి బాట’ వివిధ రకాల సురక్షితమైన పొదుపు వర్గాలను ఎంచుకొని భవిష్యత్తు ఆర్థిక అవసరాలకు తగ్గట్టు పొదుపు చేసుకోవాలన్నారు.
Similar News
News December 8, 2025
ఎకరాల భూమి ఉన్నా.. అమ్మలేరు..!

ప్రత్తిపాడు మండలం చింతలూరులో దశాబ్దాలుగా భూములన్నీ ఈనాం పరిధిలో ఉండటంతో, భూ పట్టాలు లేక రైతులు భూమిని అమ్ముకోలేక, కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదునుగా గ్రామంలోని కొందరు పెత్తందారులు రైతులు పండించుకుంటున్న భూమిపై పన్నులు కూడా వసూలు చేస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని తమ ఈనాం సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
News December 8, 2025
మెదక్: ‘పెండింగ్ బకాయిల జాబితా విడుదల చేయాలి’

ఆర్థిక శాఖ అధికారులు ఉద్యోగులకు నవంబర్ నెల విడుదల చేసిన రూ.707.30 కోట్ల ఉద్యోగులకు రావలసిన పెండింగ్ బకాయిల టోకెన్ నెంబర్ల జాబితా విడుదల చేయాలని టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ డిమాండ్ చేశారు. సోమవారం ఉద్యోగులతో కలిసి మాట్లాడారు. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క నవంబర్ నెలకు సంబంధించిన రూ.707. 30 కోట్ల ఉద్యోగుల బకాయిలు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారన్నారు.
News December 8, 2025
కర్నూలు SP చెంతకు 119 ఫిర్యాదులు

కర్నూలు SP చెంతకు 119 ఫిర్యాదులు వచ్చాయని వాటిని విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. SP కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం 119 ఫిర్యాదులు స్వీకరించామన్నారు. ప్రజల సమస్యలను వ్యక్తిగతంగా విని సంబంధిత పోలీసులను త్వరితగతిన పరిష్కరించేందుకు జిల్లా SP విక్రాంత్ పాటిల్ ఆదేశించారు.


