News March 8, 2025
NRPT: ఇంటర్ పరీక్షకు 4553 మంది హాజరు

నారాయణపేట జిల్లా వ్యాప్తంగా 16 పరీక్ష కేంద్రాలలో శుక్రవారం జరిగిన ఇంటర్ పరీక్షకు 4553 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని DIEO సుదర్శన్ రావు తెలిపారు. మొత్తం విద్యార్థులు 4702 కాగా, వారిలో 149 మంది పరీక్షలకు గైర్హాజరు అయ్యారని చెప్పారు. మరికల్, మక్తల్ గురుకుల జూనియర్ కళాశాలలోని పరీక్ష కేంద్రాలను సిట్టింగ్ స్క్వాడ్‌లు తనిఖీలు చేశారని చెప్పారు. మూడవ రోజు పరీక్ష ప్రశాంతంగా జరిగిందని చెప్పారు.
Similar News
News November 26, 2025
2027కు 30 డాలర్లకు ముడిచమురు.. పెట్రోల్ రేట్లు తగ్గుతాయా?

వచ్చే రెండేళ్లలో ప్రపంచ మార్కెట్‌లో ముడిచమురు సరఫరా భారీగా పెరగనుందని జేపీ మోర్గాన్ అంచనా వేసింది. OPEC+(పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య), non-OPEC దేశాలు గణనీయంగా ఉత్పత్తిని పెంచడమే కారణమని తెలిపింది. దీంతో ప్రస్తుతం $60గా ఉన్న బ్యారెల్ ధర FY2027 చివరికి $30కు పడిపోవచ్చని వెల్లడించింది. దీనివల్ల అతిపెద్ద దిగుమతిదారైన INDకు భారీ లబ్ధి చేకూరే అవకాశం ఉంది. పెట్రోల్ రేట్లు తగ్గొచ్చని నిపుణుల అంచనా.
News November 26, 2025
కర్ణాటకలో సీఎం మార్పుపై తేల్చని కాంగ్రెస్ అధిష్ఠానం

కర్ణాటక సీఎం మార్పుపై నెలకొన్న ప్రతిష్టంభన కొనసాగుతోంది. కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి ఎటువంటి సమాచారం రాకపోవడంతో ఆ పార్టీ నాయకులంతా అయోమయంలో ఉన్నారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మద్దతుదారులు మాత్రం తమ నాయకుడిని సీఎం చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ విషయాన్ని హైమాండ్‌కు చెప్పేందుకు ఢిల్లీ వెళ్లనున్నారు. అధికార భాగస్వామ్యంపై జరిగిన ఒప్పందాన్ని అమలు చేయాలని కోరుతున్నారని సమాచారం.
News November 26, 2025
లైన్‌క్లియర్: HYDలో అండర్ గ్రౌండ్ నుంచి కేబుల్స్!

విద్యుత్ సరఫరా సమస్యలు పరిష్కరించేందుకు TGSPDCL చర్యలకు ప్లాన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అండర్ గ్రౌండ్ కేబుల్స్ తీసుకొచ్చేందుకు ప్రతిపాదనలు పంపగా తాజాగా మంత్రివర్గం ఇందుకు ఆమోదం తెలిపింది. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం రూ.14,725 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. ఇది సక్సెస్ అయితే సిటీలో కరెంట్ పోల్స్, వేలాడుతోన్న వైర్ల సమస్యకు తెర పడనుంది.


