News March 7, 2025
NRPT: ఇంటర్ ఫస్టియర్ ఇంగ్లిష్ పరీక్షకు 149 మంది గైర్హాజరు

నారాయణపేట జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు రెండో రోజు ఇంగ్లిష్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం మొత్తం జిల్లా వ్యాప్తంగా 16 పరీక్ష కేంద్రాలలో జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఇంగ్లిష్ పరీక్షకు 4,702 మంది విద్యార్థులకు గాను, 4553 విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు DIEO అధికారులు తెలిపారు. మొత్తం 149 మంది విద్యార్థులు వివిధ కారణాలతో పరీక్షలకు గైర్హాజరైనట్లు వెల్లడించారు.
Similar News
News December 7, 2025
రెండు మూడేళ్లుగా ఇలా ఆడలేదు: కోహ్లీ

ఇటీవలికాలంలో తాను ఈ తరహాలో ఆడలేదని విరాట్ కోహ్లీ తెలిపారు. ‘ఈ సిరీస్లో ఆటతో సంతృప్తిగా ఉన్నాను. నిజాయతీగా చెప్పాలంటే గడిచిన రెండు మూడేళ్లలో ఈ విధంగా ఆడలేదు. 15-16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో కొన్నిసార్లు మన సామర్థ్యంపై అనుమానం కలుగుతుంది. మిడిల్ ఆర్డర్లో ఇలా ఆడితే జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని తెలుసు’ అని కోహ్లీ చెప్పారు. కాగా SAపై కోహ్లీ రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో అదరగొట్టారు.
News December 7, 2025
‘విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తా’

విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తానని కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్, రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ ఛైర్మన్ నారాయణస్వామి పాల్గొన్నారు. దివ్యాంగుల హక్కుల చట్టం జిల్లాలో పటష్ఠంగా అమలు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.
News December 7, 2025
ఇండిగోకి DGCA షోకాజ్ నోటీసులు

ఇండిగో సర్వీసుల్లో ఏర్పడిన గందరగోళంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సంస్థ CEO పీటర్ ఎల్బర్స్, మేనేజర్కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లోగా సమాధానమివ్వాలని పేర్కొంది. లార్జ్ స్కేల్ క్యాన్సిలేషన్స్, ప్లానింగ్లో వైఫల్యం, నిర్లక్ష్యం వంటి అంశాలను నోటీసుల్లో ప్రస్తావించింది. ఈ విషయంలో ఇండిగో సంస్థపై కఠిన చర్యలు ఉంటాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.


