News February 11, 2025
NRPT: ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు

ఇసుక అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. అక్రమంగా రవాణా చేసిన అధిక ధరలకు విక్రయించిన తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడైనా అక్రమంగా ఇసుకను తరలించిన, నిల్వ చేసిన పోలీసులకు ఫిర్యాదు చేయాలని లేదా డయల్ 100 నంబర్ కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఇసుక రీచ్ ల వద్దా భద్రత ఏర్పాటు చేస్తున్నామన్నారు.
Similar News
News December 10, 2025
తిరుపతి: పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం.!

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ(BRAOU) పరిధిలో M.B.A, M.LI.Sc విద్యార్థులు PG మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు పరీక్షా ఫీజు చెల్లించాలని తిరుపతి ప్రాంతీయ కార్యాలయ కో-ఆర్డినేటర్ మల్లికార్జునరావు పేర్కొన్నారు. పరీక్ష ఫీజు చెల్లించడానికి డిసెంబర్ 22 చివరి తేదీ అని చెప్పారు. మరిన్ని వివరాలకు www.braouonline.in వెబ్సైట్ చూడాలని సూచించారు.
News December 10, 2025
గన్నవరం: ఇసుక కుప్ప కాదండి.. రంగు మారిన ధాన్యం..!

పై ఫోటోలో మీకు కనిపిస్తున్నది ఇసుక కుప్ప అనుకుంటున్నారు కదూ. కానే కాదు.. అది రంగు మారిన ధాన్యం రాశి. గత మొంథా తుఫాను వరదలో నానిన వరి చేను నూర్చారు. గన్నవరం మండలం పురుషోత్తపట్నం గ్రామంలో ఇలా రంగు మారిన ధాన్యం రాశులు చూడొచ్చు. రైతులు 75 కిలోల బస్తా రూ.1300 చొప్పున వ్యాపారికి బుధవారం విక్రయించారు. ఈ విధంగా బస్తాకు వెయ్యి రూపాయలు చొప్పున రైతులకు నష్టాలు మిగిల్చింది తుఫాను.
News December 10, 2025
నర్సీపట్నం: ఏడాది చిన్నారికి స్క్రబ్ టైఫస్గా నిర్ధారణ

నర్సీపట్నం మండలం వేములపూడి పీ.హెచ్.సీ. పరిధిలో స్క్రబ్ టైఫస్ కేసు నమోదయింది. దీంతో వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. మూడు రోజుల కిందట జ్వరంతో బాధపడుతున్న ఒక సంవత్సరం పాపకు ఆ లక్షణాలు కనిపించడంతో కేజీహెచ్కు తరలించారు. అక్కడ పరీక్ష చేయగా స్క్రబ్ టైఫస్గా నిర్ధారించారు. చికిత్స పొందుతున్న చిన్నారి ప్రస్తుతం కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.


