News March 31, 2025
NRPT: ఈద్గా, మజీద్ల వద్ద పటిష్ఠ పోలీస్ బందోబస్తు

రంజాన్ పండగను పురస్కరించుకొని సోమవారం జిల్లాలోని ఈద్గా, మజీదుల వద్ద పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా డైవర్షన్ చేస్తామని అన్నారు. జిల్లా కేంద్రంలోని చౌరస్తాల్లో పోలీస్ పీకేటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. పండగను శాంతియుతంగా జరుపుకోవాలని అన్నారు. ప్రజలకు రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News December 9, 2025
తిరుమలలో మిస్సింగ్.. ఈ పాప మీకు తెలుసా?

తిరుమల లేపాక్షి సర్కిల్ దగ్గర 10 ఏళ్ల బాలిక ఒంటరిగా కనిపించగా భక్తుల సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెకు మాటలు రావు. బాలిక పేరు, చిరునామా తెలియదు. తల్లిదండ్రులు ఎవరూ కనబడలేదు. బాలికను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ(CWC) ద్వారా తిరుపతిలోని PASS NGO సంస్థకు అప్పగించారు. ఆచూకీ తెలిసిన వారు 08772-289031, 94407-96772 నంబర్లను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
News December 9, 2025
ఎన్యూమరేటర్లకు బెదిరింపులు.. ECIకు సుప్రీం నోటీసులు

SIR చేపట్టిన BLOలకు భద్రత కల్పించాలని దాఖలైన పిటిషన్లపై తమ వైఖరి తెలపాలని ECI, కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది. డోర్-టు-డోర్ సర్వేకు వెళ్లిన వారిని ముఖ్యంగా బెంగాల్లో అడ్డుకుంటున్నారని, బెదిరిస్తున్నారని వేసిన రెండు పిటిషన్లను CJI జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జాయ్మాల్య బాగ్చీ బెంచ్ నేడు విచారించింది. పరిస్థితిని అదుపులోకి తేవాలని లేదంటే దారుణాలు జరుగుతాయని ECని CJI ఆదేశించారు.
News December 9, 2025
అన్నవరం ఈవో బదిలీ

అన్నవరం దేవస్థానంలో వరుస ఘటనలపై Way2Newsలో వార్తా కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. మంగళవారం ప్రభుత్వం ఈవో సుబ్బారావుపై వేటు వేసింది. ఆయనను మాతృ సంస్థ రెవెన్యూ శాఖకు తిరిగి పంపింది. కొత్త ఈవోగా దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ త్రినాధరావును నియమించింది. సుబ్బారావు సర్వీస్ వెనక్కి తీసుకోవడంతో ఆయనపై జరిగిన విచారణ నివేదికపై ఎలాంటి చర్యలు ఉంటాయనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.


