News February 2, 2025

NRPT: ఈవీఎం గోదామును పరిశీలించిన కలెక్టర్

image

నారాయణపేట పట్టణంలోని ఈవీఎం గోదాములను శనివారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. గోదాముల వద్ద పోలీసు భద్రతను పరిశీలించారు. 24 గంటల పోలీస్ పహారా ఉండాలని, ఇతరులను లోపలికి అనుమతించరాదని సూచించారు. సీసీ కెమెరాలు ఎప్పటికప్పుడు పని చేస్తున్నాయో లేదో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డిఓ రామచందర్ నాయక్, సంబంధిత అధికారులు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Similar News

News February 19, 2025

కడప జిల్లా TODAY టాప్ న్యూస్

image

➣ కడప: ‘ముస్లింలు అంటే సీఎంకు చిన్నచూపు’
➣ గోపవరం: గుండెపోటుతో 24 ఏళ్ల యువకుడు మృతి
➣ సిద్దవటం మండలంలో భారీ చోరీ
➣ 22న ప్రొద్దుటూరులో మినీ జాబ్ మేళా
➣ లింగాలలో పట్టుబడిన చీనీ కాయల దొంగలు
➣ కడప జిల్లాలో నేటి నుంచి ఆధార్ క్యాంపులు
➣ కమలాపురం: నలుగురి పిల్లలతో తల్లి జీవన పోరాటం
➣ గండికోటలో సెల్ఫీ తీసుకున్న కలెక్టర్, MLA
➣ జగన్‌పై జమ్మలమడుగు MLA ఫైర్

News February 19, 2025

లేబర్ బడ్జెట్ లక్ష్యాన్ని అధిగమించండి: కలెక్టర్

image

నంద్యాల జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద పెండింగ్లో ఉన్న 12 లక్షల వేతనదారుల లేబర్ బడ్జెట్ లక్ష్యాన్ని అధిగమించేందుకు ఏపీడీలు, ఎంపీడీవోలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని ఎన్ఐసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉపాధి హామీ లక్ష్యాల ప్రగతిపై సమీక్షించారు. మార్చి 31వ తేదీ లోగా పూర్తి చేయాలని ఎంపీడీవో, ఏపీడీ, ఏపీవోలను ఆదేశించారు.

News February 19, 2025

జనగామ: ఉపాధ్యాయుడిగా మారిన అదనపు కలెక్టర్

image

జనగామ జిల్లా కేంద్రంలోని శామీర్ పేటలో గల టీజీఎంఆర్ఈఐఎస్ బాలుర వసతి గృహాన్ని అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) పింకేశ్ కుమార్ సందర్శించి వసతి గృహంలో వసతి సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడుగా మారి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

error: Content is protected !!