News April 1, 2025
NRPT: ఈ పథకానికి లాస్ట్ డేట్ ఎప్పుడంటే..?

జిల్లా యువతకు ఆర్థికచేయూత అందించడానికి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కీలక పథకం “రాజీవ్ యువ వికాస్”. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు మొదట చివరి తేదీ ఏప్రిల్ 5 కాగా.. దరఖాస్తుల స్వీకరణలో రాష్ట్రసర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజీవ్ యువ వికాస్ దరఖాస్తుల గడువును ఏప్రిల్ 14 వరకు పొడగించింది. దీంతో జిల్లా నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. SHARE IT.
Similar News
News April 23, 2025
వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగింపు

AP: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి విజయవాడ సీఐడీ కోర్టు మరోసారి రిమాండ్ పొడిగించింది. వచ్చే నెల 7 వరకు ఆయనకు రిమాండ్ విధిస్తున్నట్లు న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. దీంతో పోలీసులు ఆయనను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. కాగా సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కూడా నిన్న వంశీకి ఎస్సీ, ఎస్టీ కోర్టు మే 6 వరకు రిమాండ్ పొడిగించిన విషయం తెలిసిందే.
News April 23, 2025
భైంసా: సమర్థవంతమైన సేవలను అందించాలి: ఎస్పీ

ప్రజలకు సమర్థవంతంగా పోలీసులు సేవలను అందించాలని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల సూచించారు. బుధవారం భైంసా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగానికి హాజరై అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. గ్రీవెన్స్‌లో వచ్చిన ఫిర్యాదులను ఆన్లైన్లో పొందుపరుస్తూ ఫిర్యాదులను పరిష్కరించాలన్నారు. సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు.
News April 23, 2025
ఉగ్రవాదంపై కలిసి పోరాడాలి: హరీశ్ రావు

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రమూకలు పర్యాటకులను హతమార్చిన విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురైనట్లు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు X ద్వారా వెల్లడించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని వేడుకున్నట్లు చెప్పారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అందరం కలిసికట్టుగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.