News September 10, 2024
NRPT: ఉత్తమ గ్రామ పంచాయతీల ఎంపికకు నివేదికలు పంపండి
జాతీయ ఉత్తమ గ్రామ పంచాయతీల ఎంపికకు నివేదికలు పంపించాలని కలెక్టర్ సిక్త పట్నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం నారాయణపేట కలెక్టరేట్లో డిఆర్డిఏ అధికారులతో సమావేశం నిర్వహించారు. 9 అంశాల్లో నివేదికలు మంగళవారం సాయంత్రంలోగా పంపించాలని చెప్పారు. వాటిని పరిశీలించి జాతీయ పురస్కారాల కొరకు ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుందని సూచించారు. సంబంధిత అధికారులు పాలోన్నారు.
Similar News
News October 3, 2024
వనపర్తి: ఇద్దరు కానిస్టేబుల్స్ సస్పెండ్
వనపర్తి జిల్లాలో ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీరంగాపూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన రాకేష్ హైదరాబాద్ గణేష్ బందోబస్తుకు వెళ్లి విధుల్లో చేరకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటం సీసీఏ రూల్స్‌కు విరుద్ధమని సస్పెండ్ చేశారు. పానగల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన రామకృష్ణ అనుమతి లేకుండా విధులకు గైర్హాజరుతో సస్పెండ్ చేశారు.
News October 3, 2024
WNP: 21 నుంచి CM కప్ పోటీలు: శివసేనారెడ్డి
ఈ నెల 21 నుంచి ప్రతి గ్రామంలో గ్రామస్థాయి CM కప్ పోటీలు ప్రారంభిస్తామని సాట్ ఛైర్మన్ శివసేనారెడ్డి వెల్లడించారు. ఈనెల 21 నుంచి ఆరు అథ్లెటిక్స్ విభాగాల పోటీలను, ఖోఖో, వాలీబాల్ పోటీలను ఏర్పాటు చేశామన్నారు. 21 నుంచి 24 వరకు గ్రామీణ స్థాయి పోటీలు, 24 నుంచి 30 వరకు మండల స్థాయి పోటీలు, NOV 8 నుంచి 13 వరకు జిల్లా స్థాయి పోటీలు ఉంటాయన్నారు. NOV 28 నుంచి DEC 5వరకు రాష్ట్రస్థాయి పోటీలు ఉంటాయని తెలిపారు.
News October 3, 2024
వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో 84 బ్లడ్ నిల్వలు
వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 84 బ్లడ్ నిల్వలు అందుబాటులో ఉన్నట్లు జిల్లా వైద్యాధికారి జయచంద్ర మోహన్ గురువారం తెలిపారు. వారు మాట్లాడుతూ.. A+(ve) 11, A- (ve) 06, B+(ve) 19, B-(ve) 00, O+(ve) 37, O-(ve) 01, AB+(ve) 09, AB-(ve) 01 ఉన్నట్లు తెలిపారు. ఆసక్తి గలవారు ఆసుపత్రిని సంప్రదించాలని కోరారు.