News April 4, 2024
NRPT: ‘ఉద్యోగావకాశాలు.. ఇంటర్వ్యూల్లో పాల్గొనండి’

నారాయణపేట జిల్లా వైద్య కళాశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల నియామకానికి నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. 22 సీనియర్ రెసిడెంట్, 3 ఎకనామీ, 2 ఫిజియాలజీ, 2 బయో కెమిస్ట్రీ ట్యూటర్ పోస్టులు ఉన్నాయని తెలిపారు. అభ్యర్థులు ధ్రువపత్రాలతో ఏప్రిల్ 6 న ఉదయం 9 గంటలకు వైద్య కళాశాలలో వాక్ ఇన్ ఇంటర్వ్యూలో పాల్గొనాలని, వివరాలకు https://narayanpet.telagana.gov.in లో చూడాలన్నారు.
Similar News
News April 16, 2026
MBNR: పీయూ..డిగ్రీ 6వ సెమిస్టర్ పరీక్షలు

పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 6వ సెమిస్టర్ పరీక్షలు ఇవాళ ప్రారంభమయ్యాయి. వివేకానంద డిగ్రీ కళాశాలలో పరీక్షల నియంత్రణ అధికారిణి డాక్టర్ కే.ప్రవీణ పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. డాక్టర్ కే.ప్రవీణ మాట్లాడుతూ.. డిగ్రీ పరీక్షలు సజావుగా జరగాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, మాస్ కాఫీయింగ్‌కు అవకాశం లేకుండా చూడాలని అధికారులను సూచించారు.
News April 16, 2026
జడ్చర్ల: పీజీ వైద్య విద్యార్థి ఆత్మహత్య

జడ్చర్ల మండలంలోని కొడుగల్ ఉమ్మడి గ్రామపంచాయతీ పరిధి బిమ్లాగాని తండాకు చెందిన జనరల్ మెడిసిన్ పీజీ విద్యార్థి కాట్రావత్ సురేష్ హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో చదువుతున్న సురేష్ హాస్టల్ రూంలో పాయిజన్ ఇంజక్షన్ తీసుకొని మృతి చెందాడు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 16, 2026
సీసీ కుంట: శ్రావణి మృతి కేసులో మలుపు.. ప్రవీణ్ మృతి..!

చిన్నచింతకుంట(M) కురుమూర్తి స్వామి గుట్ట వద్ద బుధవారం నిన్న అనుమానాస్పదస్థితిలో మహిళ <<19658838>>మృతి చెందిన<<>> కేసు మలుపు తిరిగింది. ఎస్‌ఐ ఓబుల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మరికల్(M) వెంకటాపూర్‌కు చెందిన శ్రావణి(26) మృతదేహం అనుమానాస్పదంగా లభించగా, అదే గ్రామానికి చెందిన ప్రవీణ్ అక్కడే స్పృహ కోల్పోయి ఉన్నాడు. అతడిని 108లో ఆసుపత్రికి తరలించేలోపు మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


