News January 23, 2025
NRPT: ఎంపీ డీకే అరుణ పర్యటన వివరాలు

మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ గురువారం నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాలలో పర్యటిస్తారని నర్వ మండల బీజేపీ అధ్యక్షుడు అజిత్ సింహరెడ్డి తెలిపారు. పర్యటనలో భాగంగా మరికల్, అమరచింత, ఆత్మకూరు మునిసిపాలిటీలలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారని చెప్పారు. ఎంపీ పర్యటనలో బీజేపీ నాయకులు, శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Similar News
News December 6, 2025
టెన్త్ పరీక్షలు.. ఎడిట్ ఆప్షన్ ప్రారంభం: తిరుపతి DEO

పదో తరగతి పబ్లిక్ పరీక్షలు-2026కు సంబంధించి వివరాలు ఖరారు చేయడానికి UDISE+ పోర్టల్‌లో ఎడిట్ ఆప్షన్ ప్రారంభమైనట్లు తిరుపతి DEO KVN కుమార్ పేర్కొన్నారు. నామినల్ రోల్‌లో విద్యార్థికి సంబంధించిన వివిధ వివరాలను సరిదిద్దడానికి, కొత్తగా చేర్చడానికి ఈ సౌకర్యం అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థి వివరాలు నమోదు చేసేటప్పుడు ఎటువంటి తప్పులు చేయొద్దని సూచించారు.
News December 6, 2025
విమాన టికెట్ ధరలు పెంచకూడదు: కేంద్ర మంత్రి

విమానయాన రంగంలో ప్రస్తుతం నెలకొన్న గందరగోళ పరిస్థితిని చక్కదిద్దేందుకు శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శనివారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, డీజీసీఏ అధికారులతో కలిసి ఇండిగో సంస్థ కార్యకలాపాలను సమీక్షించారు. ఇండిగో సంస్థ తమ సేవలను వీలైనంత త్వరగా సాధారణ స్థితికి తెచ్చుకోవాలని, టికెట్ ఛార్జీలను పెంచరాదని మంత్రి ఆదేశించారు.
News December 6, 2025
అనంత: చలిమంట కాచుకుంటూ వ్యక్తి మృతి

డి.హిరేహాల్ మండల కేంద్రంలో చలిమంట కాచుకుంటూ ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి వివరాల మేరకు.. గ్రామానికి చెందిన సిద్దేశ్ గత నెల 30న చలిమంట కాచుకుంటూ ఉండగా మంటలు అంటుకుని తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు బళ్లారి విమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.


