News April 3, 2024
NRPT: ‘ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి’

పార్లమెంట్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. మంగళవారం నారాయణపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పిఓ, ఏపిఓ లకు పార్లమెంట్ ఎన్నికల నిర్వహణపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం ఎన్నికలను సజావుగా, ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించాలని అన్నారు. ఎన్నికల నిర్వహణపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
Similar News
News December 21, 2025
MBNR: అన్నదాతల ఖాతాల్లోకి బోనస్ నిధులు..

MBNR జిల్లాలోని సన్న వరి సాగుదారులకు ఆర్థిక ఊరట లభించింది. ప్రభుత్వం ప్రకటించిన సన్న రకం బోనస్ కింద రూ.21.95 కోట్లను రైతు ఖాతాల్లో జమ చేసేందుకు పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలో మొత్తం 7,971 మంది రైతులు ఈ బోనస్కు అర్హత సాధించగా, డిఎం రవి నాయక్ వివరాలను వెల్లడించారు. ముందుగా 4000 మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు చేరుతాయని, అనంతరం మిగిలిన రైతులకు జమ చేస్తామని ఆయన పేర్కొన్నారు.
News December 21, 2025
MBNR: ఈనెల 22న ‘మాక్ డ్రిల్’: అదనపు కలెక్టర్

జాతీయ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఆదేశాలతో MBNR జిల్లాలో 6 ప్రదేశాలలో ‘మాక్ డ్రిల్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వీసీ కాన్ఫరెన్స్ హాల్లో రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, ఇరిగేషన్, వైద్య ఆరోగ్య శాఖ, ఆర్&బి, పరిశ్రమల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి, మాక్ డ్రిల్ నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.