News March 23, 2024
NRPT: ‘ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు చేయాలి’

ఈనెల 28న జరిగే స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ ఉపఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ మయాంక్ మిత్తల్ అన్నారు. శుక్రవారం నారాయణపేట కలెక్టరేట్ లో ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులతో సమావేశం నిర్వహించారు. నారాయణపేట ఎంపిడివో కార్యాలయంలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని.. జిల్లాలో మొత్తం 205 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. పొరపాట్లు జరగకుండా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు.
Similar News
News October 26, 2025
MBNR: సాదాబైనామాల పరిష్కారానికి మోక్షం

సాదాబైనామాల దరఖాస్తుల పరిష్కారానికి మోక్షం కలగనుంది. జీఓ 112 అమలుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయడంతో క్రమబద్ధీకరణ ప్రక్రియను రెవెన్యూ అధికారులు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 2020లో ఆన్లైన్లో వచ్చిన 4,217, ఇటీవల రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన 3,456 దరఖాస్తుల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించారు. దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు.
News October 25, 2025
బాలానగర్: పుట్టినరోజే.. చివరి రోజుగా మారింది..!

బాలానగర్ మండలంలోని పంచాంగుల గడ్డ తండాలో శనివారం తీవ్ర విషాదం నెలకొంది. తాండవాసుల వివరాల ప్రకారం.. కేతావత్ విష్ణు (25) సెంట్రింగ్ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. కుటుంబ సభ్యులతో భూమి, డబ్బుల విషయంలో విషయంలో గొడవపడ్డాడు. క్షణికావేశంలో 3 రోజుల క్రితం క్రిమిసంహారక మందు తాగాడు. చికిత్స పొందుతూ.. ఈరోజు ఉదయం మృతి చెందాడు. పుట్టినరోజు నాడే.. మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
News October 25, 2025
రేపు కురుమూర్తిస్వామి అలంకరణ మహోత్సవం

పేదల తిరుపతిగా పేరుగాంచిన చిన్నచింతకుంట మండలం అమ్మపూర్లోని శ్రీ కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 22నుంచి వైభవంగా ప్రారంభమయ్యాయి.ఈ ఉత్సవాలలో భాగమైన స్వామివారి అలంకరణ మహోత్సవం ఆదివారం నిర్వహించనున్నారు. ఆత్మకూరు ఎస్బీఐ బ్యాంకులో ఉన్న స్వామి వారి ఆభరణాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని స్వామివారికి అలంకరించనున్నట్లు ఆలయ ఛైర్మన్ గోవర్ధన్ రెడ్డి తెలిపారు.


