News March 26, 2025
NRPT: ‘ఓపెన్ స్కూల్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి’

నారాయణపేట జిల్లా కేంద్రంలో వచ్చే నెల 20 నుంచి 26 వరకు జరగబోయే ఓపెన్ స్కూల్ సార్వత్రిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి తగు సూచనలు ఇచ్చారు. పదోతరగతి పరీక్షలకు మూడు పరీక్ష కేంద్రాలను, ఇంటర్మీడియట్ పరీక్షలకు ఐదు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సౌకర్యాలు కల్పించాలని అన్నారు.
Similar News
News December 9, 2025
ఈ మండలాల్లో ఎన్నికల ప్రచారం చేయవద్దు: సుర్యాపేట ఎస్పీ

సూర్యాపేట జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్న సూర్యపేట, ఆత్మకూర్, మద్దిరాల, తుంగతుర్తి, అర్వపల్లి, నాగారం, తిరుమలగిరి ఈ మండలాలలో మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికల సమయం ముగిసిందని ఎస్పీ నర్సింహ ఓ ప్రకటనలో తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద గుంపులు గుంపులుగా చేరవద్దని, పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News December 9, 2025
సూర్యాపేట: ముగిసిన మొదటి విడత ఎన్నికల ప్రచారం

సూర్యాపేట జిల్లాలో గ్రామపంచాయతీ, వార్డు సభ్యుల ఎన్నికల మొదటి విడత ప్రచారం మంగళవారం సాయంత్రం ముగిసింది. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసినప్పటి నుంచి బరిలో నిలిచిన వివిధ పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచార పర్వంలో పాల్గొన్నారు. ఈనెల 11న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ప్రచారంలో నిలబడిన అభ్యర్థుల గెలుపు కోసం ఆయా పార్టీల కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
News December 9, 2025
మెదక్: సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడిగా చుక్క రాములు

సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా చుక్క రాములు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మెదక్లో మూడు రోజులుగా జరిగిన రాష్ట్ర 5వ మహాసభల్లో ఈ మేరకు తీర్మానం చేశారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా పాలడుగు భాస్కర్, కోశాధికారిగా రాములు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అనేక కార్మిక అంశాలపై తీర్మానాలు చేశారు. నూతన కార్యవర్గానికి మెదక్ జిల్లా కార్యదర్శి మల్లేశం అభినందనలు తెలిపారు.


