News April 7, 2024

NRPT: ఓపెన్ స్కూల్ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి

image

ఈనెల 25 నుంచి ప్రారంభమయ్యే ఓపెన్ స్కూల్ పదవ తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ మయాంక్ మిత్తల్ అధికారులను ఆదేశించారు. శనివారం నారాయణపేట కలెక్టరేట్ లో సంబందిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో మూడు పదవ తరగతి, నాలుగు ఇంటర్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.

Similar News

News July 11, 2025

పాలమూరు: PM KISAN… జాగ్రత్త సుమా!

image

రైతులకు కేంద్రం అందిస్తున్న రూ.6వేలు ‘PM-KISAAN’ పథకాన్ని అడ్డుపెట్టుకొని సైబర్ కేటుగాళ్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. వాటిపై క్లిక్ చేసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. నకిలీ యాప్లపై క్లిక్ చేయవద్దని, OTPలు ఎవరికి చెప్పవద్దని ఆయా జిల్లాల ఎస్పీలు హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరగాళ్లపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ జానకి సూచించారు. ఎవరైనా సైబర్ నేరానికి గురైతే 1930కు ఫోన్ చేయాలన్నారు. SHARE IT

News July 10, 2025

MBNR: కల్లు డిపోల లైసెన్స్ రద్దు చేస్తాం: మంత్రి

image

HYDలో కల్తీ కల్లు ఘటనపై మంత్రి జూపల్లి కృష్ణారావు Xలో ట్వీట్ చేశారు. ‘ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే ఎంతటి వారినైనా వదలం. కల్లు శాంపిల్ టెస్టింగ్ కోసం ఫోరెన్సిక్ పంపాం. నివేదిక ఆధారంగా బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు, కల్లు డిపోల లైసెన్స్ రద్దు చేస్తాం. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం’ అని రాసుకొచ్చారు.

News July 8, 2025

TG కొత్త రేషన్ కార్డు… ఇలా చెక్ చేసుకోండి

image

కొత్త రేషన్ కార్డు తమకు వచ్చిందో లేదో తెలుసుకోవడానికి ఆన్‌లైన్‌లో https:epds.telangana.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. FSC Search.FSC Application Search ఆప్షన్ స్క్రీన్‌పై క్లిక్ చేస్తే మీ-సేవా అప్లికేషన్ సెర్చ్ విండో ఓపెన్ అవుతుంది. మీ జిల్లాను ఎంచుకొని, మీ-సేవా కేంద్రం ఇచ్చిన అప్లికేషన్ నంబర్ ఎంటర్ చేసి Search క్లిక్ చేయాలి. వెంటనే మీ దరఖాస్తుకు సంబంధించిన స్టేటస్ కింద డిస్ ప్లే అవుతుంది.