News March 26, 2025

NRPT: ‘ఓపెన్ స్కూల్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి’

image

నారాయణపేట జిల్లా కేంద్రంలో వచ్చే నెల 20 నుంచి 26 వరకు జరగబోయే ఓపెన్ స్కూల్ సార్వత్రిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి తగు సూచనలు ఇచ్చారు. పదోతరగతి పరీక్షలకు మూడు పరీక్ష కేంద్రాలను, ఇంటర్మీడియట్ పరీక్షలకు ఐదు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సౌకర్యాలు కల్పించాలని అన్నారు.

Similar News

News April 19, 2025

శుభ ముహూర్తం (19-04-2025)(శనివారం)

image

తిథి: బహుళ షష్టి మ.1.55 వరకు.. నక్షత్రం: మూల ఉ.6.33 వరకు, తదుపరి పూర్వాషాడ.. శుభ సమయం: సామాన్యము.. రాహుకాలం: ఉ.9.00 నుంచి 10.30 వరకు.. యమగండం: మ.1.30-3.00 వరకు.. దుర్ముహూర్తం: ఉ.6.00 నుంచి 7.36 వరకు.. వర్జ్యం: శే.ఉ.6.32వరకు, పున: సా.4.30 నుంచి 6.09వరకు.. అమృత ఘడియలు: లేవు

News April 19, 2025

అగ్ని ప్రమాద రహితంగా మార్చడమే లక్ష్యం: మంత్రి

image

అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రాష్ట్ర విపత్తు స్పందన&అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో ట్రెండ్ సెట్ మాల్‌లో శుక్రవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర హోమ్ మంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు. రాష్ట్రాన్ని అగ్ని ప్రమాద రహితంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా అగ్నిప్రమాలు జరిగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సిబ్బంది లైవ్‌లో చేసి చూపించారు. 

News April 19, 2025

కలెక్టర్‌ను కలిసిన జీవియంసీ కాంట్రాక్టర్లు

image

విశాఖ కలెక్టర్, జీవీఎంసీ ఇన్‌ఛార్జ్ కమిషనర్ హరేంధిర ప్రసాద్‌ను కలిసిన జీవీఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఛైర్మన్ఆధ్వర్యంలో శుక్రవారం కలిశారు. జీవీఎంసీలో పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించాలని కోరారు. కోట్లాది రూపాయలు అప్పులు చేసి వడ్డీలు కట్టలేకపోతున్నామని వాపోయారు. కలెక్టర్ వెంటనే స్పందించి రూ.ఆరు కోట్లు రిలీజ్ చేస్తామని హామీ ఇవ్వడం ఇచ్చారు.

error: Content is protected !!