News April 13, 2025
NRPT: కమాండ్ కంట్రోల్ రూమ్లో శోభాయాత్ర పర్యవేక్షణ

నారాయణపేట జిల్లాలో శనివారం సాయంత్రం జరిగిన హనుమాన్ శోభాయాత్ర ఊరేగింపును ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సీసీ కెమెరాల ద్వారా పోలీసులు పర్యవేక్షించారు. జిల్లా వ్యాప్తంగా 58 చోట్ల శోభాయాత్ర నిర్వహించారని చెప్పారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు రాకుండా వాహనాలను డైవర్షన్ చేశామని చెప్పారు.
Similar News
News November 9, 2025
భారీగా పడిపోయిన ధరలు.. రైతులకు నష్టాలు!

AP: అరటి రైతులకు ఈసారి కార్తీకమాసం నష్టాల్ని తీసుకొచ్చింది. ఏటా ఈ సీజన్లో భారీ డిమాండ్తో పాటు మంచి లాభాలు వచ్చేవని అంబేడ్కర్ కోనసీమ జిల్లా రైతులు చెబుతున్నారు. కానీ ఈ ఏడాది ధరలు తగ్గి నష్టాలు మిగిలాయని వాపోతున్నారు. గత ఏడాది కర్పూర రకం అరటి గెల రూ.500 ఉండగా ఈ ఏడాది రూ.200 కూడా పలకడం లేదంటున్నారు. తుఫాను కారణంగా గెలలు పడిపోయి నాసిరకంగా మారడమూ ఓ కారణమని పేర్కొంటున్నారు.
News November 9, 2025
HYD: వారి జోలికి హైడ్రా వెళ్లదు: రంగనాథ్

నగరంలో తొలి విడతలో 6 చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. చెరువుల ఆక్రమణలను తొలగించి 105 ఎకరాల నుంచి 180 ఎకరాలకు పెంచామన్నారు. ప్రభుత్వ, ప్రజల ఆస్తులను కొల్లగొడుతున్నవారు హైడ్రాపై దాదాపు 700 వరకు కేసులు పెట్టారని, 2024 జులైకి ముందు నుంచే నివాసం ఉన్న వారి ఇళ్ల జోలికి హైడ్రా వెళ్లదన్నారు.
News November 9, 2025
బైక్ను ఢీకొట్టిన లారీ..యువకుడి మృతి

ఎస్.రాయవరం మండలం గోకులపాడు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పి.రంజిత్ (28) మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. తలుపులమ్మలోవ నుంచి ఎలమంచిలి వైపు వెళుతున్న బైక్ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ వెనుక కూర్చున్న రాజేశ్, గణేశ్ గాయపడ్డారు. వీరిని ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్.రాయవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


