News March 18, 2025
NRPT: కొట్టుకున్న మహిళలు.. ఒకరి మృతి

ఇద్దరు మహిళల మధ్య ఘర్షణలో ఓ మహిళ మృతి చెందిన ఘటన నారాయణపేట జిల్లా జలాల్ పూర్ గ్రామంలో మంగళవారం ఉదయం జరిగింది. స్థానికుల మేరకు.. గ్రామ నర్సరీ వద్ద లక్ష్మి, మరో మహిళ బుజ్జమ్మ మధ్య ఓ విషయమై మాటా మాట పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో బుజ్జమ్మ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. లక్ష్మికి తీవ్ర గాయాలు కాగా హుటాహుటిన 108లో జిల్లా ఆసుపత్రికి తరలించారు.
Similar News
News December 10, 2025
ఇతిహాసాలు క్విజ్ – 92 సమాధానం

ఈరోజు ప్రశ్న: గణపతి, కార్తీకేయ సోదరులను ముల్లోకాలు చుట్టిరమ్మనే పరీక్ష శివుడు ఎందుకు పెట్టాడు?
సమాధానం: ప్రమథగణాలకు నాయకత్వం వహించడానికి అర్హులెవరో నిర్ణయించడానికి శివుడు ఈ పరీక్ష పెట్టాడు. కార్తికేయుడు లోకాలు చుట్టడానికి వెళ్లగా, గణపతి శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణ చేసి తల్లిదండ్రులే సకల లోకాలు అని నిరూపించాడు. అలా వినాయకుడు సకల కార్యాలలో తొలి పూజలు అందుకునే వరాన్ని అనుగ్రహించాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>
News December 10, 2025
దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్‌లోనే టిడ్కో ఇళ్లు: కలెక్టర్

జిల్లాలో విభిన్న ప్రతిభావంతులకు టిడ్కో ఇళ్లు గ్రౌండ్ ఫ్లోర్‌లోనే మంజూరయ్యేలా చూస్తామని కలెక్టర్ కృతిక శుక్లా అన్నారు. ఎవరికీ మంజూరు చేయని ఇళ్లలో వారికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. దివ్యాంగుల క్రీడా పోటీలను ప్రారంభించి, మాట్లాడిన ఆమె.. క్రీడల్లో రాణించిన వారికి జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
News December 10, 2025
పంచాయతీ ఎన్నికలు.. స్కూళ్లకు రేపు సెలవు

తెలంగాణలో రేపు తొలి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. 3,800 గ్రామాల్లో సర్పంచ్, వార్డుల సభ్యులను ఎన్నుకోనున్నారు. దీంతో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన స్కూళ్లకు విద్యాశాఖ అధికారులు రేపు సెలవు ప్రకటించారు. ఆయా స్కూళ్లకు ఇవాళ కూడా హాలిడే ఉంది. తర్వాత జరిగే 2 విడతల పోలింగ్ నేపథ్యంలో ఈ నెల 13,14(ఆదివారం),16,17న కూడా స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయి.


