News March 21, 2025
NRPT: క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి: ఎస్పీ

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని, శరీరాన్ని దృఢంగా మారుస్తాయని ఎస్పీ యోగేశ్ గౌతం అన్నారు. నారాయణపేట ఎస్పీ పరేడ్ మైదానంలో గురువారం నూతనంగా ఏర్పాటు చేసిన బాక్స్ క్రికెట్ కోర్టు, వాలీబాల్ కోర్టును ప్రారంభించారు. అనంతరం కాసేపు వాలీబాల్, క్రికెట్ ఆటలను ఆడారు. పోలీసులు విరామ సమయంలో క్రీడలు ఆడేందుకు వీలుగా మైదానాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రియాజ్ హుల్ హక్ పాల్గొన్నారు.
Similar News
News December 7, 2025
ALERT.. రేపటి నుంచి భారీగా పడిపోనున్న ఉష్ణోగ్రతలు

TG: రాష్ట్రంలో రేపటి నుంచి వారం రోజుల పాటు తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతాయని వాతావరణ నిపుణులు తెలిపారు. 18 జిల్లాల్లో 9-12డిగ్రీలు, 12 జిల్లాల్లో 6-9 డిగ్రీల వరకు టెంపరేచర్స్ పడిపోతాయని అంచనా వేశారు. డిసెంబర్ 10 నుంచి 13 వరకు తీవ్రమైన చలిగాలులు వీస్తాయని తెలిపారు. పగటి వేళల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొన్నారు.
News December 7, 2025
సిరిసిల్ల: ఆల్ట్రా మారథాన్ రన్ లో పాల్గొన్న జిల్లా కానిస్టేబుల్

రాజస్థాన్లో నిర్వహించిన 100 కిలోమీటర్ల అంతర్జాతీయ ప్రమాణాల ఆల్ట్రా మారథాన్ రన్ లో జిల్లాకు చెందిన ఆర్ముడు రిజర్వ్ కానిస్టేబుల్ అనిల్ యాదవ్ పాల్గొన్నారని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి.గితే తెలిపారు. 100 కిలోమీటర్లు సాగిన ఈ రన్ లో అపారమైన ధైర్య సాహసాలు, శారీరక, మానసిక దృఢత్వాన్ని కానిస్టేబుల్ అనిల్ యాదవ్ ప్రదర్శించాడన్నారు. ఇటువంటి ఈవెంట్లో పాల్గొనడం ద్వారా యువ సిబ్బందికి ఆదర్శంగా నిలిచారని అభినందించారు.
News December 7, 2025
వరంగల్ ఎనుమాముల మార్కెట్ రేపు పునఃప్రారంభం

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పునఃప్రారంభం కానుంది. వారాంతపు సెలవుల కారణంగా నిన్న, ఈరోజు మార్కెట్ బంద్ ఉంది. రేపు ఉదయం 6 గంటల నుంచి కొనుగోళ్లు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెట్కు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు.


