News March 24, 2025

NRPT: ‘క్షయ వ్యాధి రహిత జిల్లాగా మార్చుదాం’

image

జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా మార్చుదామని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం పురస్కరించుకొని సోమవారం నారాయణపేట కలెక్టరేట్‌లో వ్యాధిగ్రస్థులకు కిట్లను అందించారు. రోగులకు సమయానికి మందులు అందించాలని వైద్యులకు సూచించారు. పౌష్టికాహారం, చికిత్సలతో వ్యాధిని పూర్తిగా నిర్మూలించవచ్చు అని అన్నారు. క్షయ వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని అన్నారు. అధికారులు పాల్గొన్నారు.

Similar News

News February 26, 2026

భారత్ నేరుగా సెమీస్‌ చేరాలంటే..

image

T20WC: నేడు వెస్టిండీస్‌పై సౌతాఫ్రికా గెలిస్తే 4 పాయింట్లతో ఆ జట్టు సెమీస్‌లోకి అడుగుపెడుతుంది. అదే సమయంలో INDకు కొంత మేలు జరుగుతుంది. భారత్.. జింబాబ్వే, వెస్టిండీస్‌లను ఓడిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం కూడా నేరుగా సెమీస్‌కు వెళ్తాం. ఒకవేళ ఇవాళ WI గెలిస్తే సౌతాఫ్రికా జింబాబ్వే చేతిలో ఓడిపోవాలి. దాంతోపాటు మనం భారీ తేడాతో జింబాబ్వే, WIపై గెలిచి విండీస్ NRRను దాటాల్సి ఉంటుంది.

News February 26, 2026

తిరుపతి జిల్లాలో పరీక్షలకు 454 మంది డుమ్మా

image

తిరుపతి జిల్లాలో గురువారం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరిగాయి. ఇందులో భాగంగా 98 కేంద్రాల్లో 29,470 మంది పరీక్షలు రాయాల్సి ఉంది. 29,016 మంది విద్యార్థులు హాజరైనట్లు RIO రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 454 మంది పరీక్షలకు రాలేదని చెప్పారు.

News February 26, 2026

శ్రీకాకుళం: గూడ్స్ రైలు నుంచి విడిపోయిన బోగీలు

image

మందస మండలం మకరజోల వద్ద విశాఖ నుంచి కోల్‌కతా వైపునకు వెళ్తున్న గూడ్స్ రైలు ఆరు బోగీలు విడిపోయాయి. మిగిలిన బోగీలతో 100 మీటర్లు ముందుకు వెళ్లి నిలిపివేశారు. దీంతో మకరజోల మీదుగా ఉద్దానం గ్రామాలకు వెళ్లే రహదారిపై రైలు క్రాసింగ్ వద్ద వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. స్థానికులు గంటపాటు ఇబ్బందులు పడ్డారు.