News February 18, 2025
NRPT: గల్లంతైన తండ్రీకొడుకులు మృతి

బావిలో పడి <<15494116>>గల్లంతైన తండ్రీకొడుకులు<<>> మృతిచెందిన ఘటన దామరగిద్ద మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. తన భార్య గ్రామమైన మండల పరిధిలోని మద్దెలబీడులో కర్ణాటకకు చెందిన శివయ్య(35) కుటుంబంతో ఉంటున్నారు. తన కుమారుడు(5) ప్రమాదవశాత్తుబావిలో పడిపోగా.. కాపాడటానికి వెళ్లి తను కూడా మునిగిపోయారు. వారిని సహాయక సిబ్బంది గాలించి మృతదేహాలను వెలికితీశారు. తండ్రీకుమారుల మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
Similar News
News December 2, 2025
కృష్ణా: స్మార్ట్ కిచెన్ల ఏర్పాటు.. విద్యార్థులు తింటారా?

ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎనిమిది ప్రాంతాల్లో స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుకు చర్యలు ప్రారంభమయ్యాయి. ఇక్కడి నుంచి గంటలోపు వేడి భోజనం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, స్మార్ట్ కిచెన్స్‌లో తయారుచేసే స్టీమ్ రైస్‌ను విద్యార్థులు ఇష్టపడరనే ఆందోళన ఉంది. మరోవైపు, ఈ కిచెన్ల ఏర్పాటుతో 4 వేల మందికి పైగా మధ్యాహ్న భోజనం హెల్పర్లు ఉపాధి కోల్పోనున్నారు.
News December 2, 2025
MHBD: 3వ విడత ఎన్నికల వివరాలు..!

జిల్లాలో 3వ విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీలు 169, వార్డులు 1,412 ఉన్నాయి. డోర్నకల్ మండలంలో 26 గ్రామాలు, 218 వార్డులు, గంగారం 12 గ్రామాలు, 100 వార్డులు, కొత్తగూడ 24 గ్రామాలు, 202 వార్డులు, కురవి 41 గ్రామాలు, 344 వార్డులు, మరిపెడ 48 గ్రామాలు,396 వార్డులు, సీరోల్ 18 గ్రామాలు, 152 వార్డులు ఉన్నాయి. 3వ విడత నామినేషన్లు ఈ నెల 3న, ఎన్నికలు 17న జరగనున్నాయి.
News December 2, 2025
ఉత్తరాంధ్రలో పెరిగిన కాలుష్యం

ఉత్తరాంధ్రలోని మూడు నగరాల్లో కాలుష్యం పెరిగింది. సోమవారం జరిగిన లోక్‌సభ సమావేశంలో హిందూపూరం MP పార్థసారథి అడిగిన ప్రశ్నకి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ సమాధానం ఇచ్చారు. 2017-18తో పోలిస్తే 2024-25లో ఉత్తరాంధ్రలో గాలి నాణ్యత మరింత దిగజారింది. ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళంలో పరిశ్రమలు వ్యర్థాలను సరిగ్గా శుద్ధి చేయకపోవడం వల్ల కాలుష్యం పెరిగిందని నిపుణులు చెబుతున్నారు.


