News February 18, 2025
NRPT: గల్లంతైన తండ్రీకొడుకులు మృతి

బావిలో పడి <<15494116>>గల్లంతైన తండ్రీకొడుకులు<<>> మృతిచెందిన ఘటన దామరగిద్ద మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. తన భార్య గ్రామమైన మండల పరిధిలోని మద్దెలబీడులో కర్ణాటకకు చెందిన శివయ్య(35) కుటుంబంతో ఉంటున్నారు. తన కుమారుడు(5) ప్రమాదవశాత్తుబావిలో పడిపోగా.. కాపాడటానికి వెళ్లి తను కూడా మునిగిపోయారు. వారిని సహాయక సిబ్బంది గాలించి మృతదేహాలను వెలికితీశారు. తండ్రీకుమారుల మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
Similar News
News March 28, 2025
నాడు వైఎస్సార్.. నేడు జగన్ పోలవరానికి అడ్డు: నిమ్మల

AP: 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు 72% పోలవరం పనులను పూర్తిచేశారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అప్పట్లో మధుకాన్ కాంట్రాక్ట్‌ను రద్దు చేసి YSR, 2019లో రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్ ప్రాజెక్టుకు అడ్డుపడ్డారని ఆరోపించారు. ఇప్పటికీ జగన్ ముఠా సైంధవుల్లా పోలవరం పురోగతికి ఆటంకాలు కలిగిస్తోందని విమర్శించారు. 9 నెలల పాలనలోనే CBN ప్రాజెక్టుకు రూ.5,052 కోట్లు అడ్వాన్స్‌గా సాధించారని చెప్పారు.
News March 28, 2025
అనకాపల్లి: పోలీసులకు గ్రీవెన్స్ నిర్వహించిన ఎస్పీ

అనకాపల్లి జిల్లాలో పోలీసుల సమస్యల పరిష్కారానికి ఎస్పీ తుహీన్ సిన్హాను శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో పలువురు పోలీసులు పాల్గొని వారి సమస్యలపై ఎస్పీకి వినతిపత్రం అందజేశారు. తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఎస్పీ ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు.
News March 28, 2025
రేపు భద్రకాళి ఆలయంలో ఒడిశాల బియ్యం వేలం

ఓరుగల్లు ఇలవేల్పు, తెలంగాణ ఇంద్రకీలాద్రి శ్రీ భద్రకాళి ఆలయంలో భక్తులు అమ్మవారికి సమర్పించిన 20 క్వింటాళ్ల ఒడిశాల బియ్యాన్ని ఈ నెల 29న ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు ఈఓ శేషుభారతి తెలిపారు. వేలంలో పాల్గొనాలనుకునే వారు రూ.5 వేలు ధరావత్ సొమ్ము డీడీ రూపంలో చెల్లించి పాల్గొనాలని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం భద్రకాళి దేవస్థాన కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.