News February 2, 2025

NRPT: గురుకులాల్లో ప్రవేశాలకు ఈ నెల 6 వరకు ఛాన్స్

image

గురుకులాల పాఠశాలల్లో ప్రవేశాలకు గడువు పొడిగించారు.  ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 6 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్  గురుకులాల్లో 5 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తుకు శనివారంతో గడువు ముగియగా మరో 6 రోజులు పొడిగించారు. వరుస సెలవులు రావడం, పెద్ద సంఖ్యలో అప్లికేషన్లు వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Similar News

News November 22, 2025

గర్భిణులు రోజుకెంత ఉప్పు తీసుకోవాలంటే..

image

గర్భిణులు ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కొందరు ఎక్కువ ఉప్పు తింటే మరికొందరు తక్కువ ఉప్పు తింటారు. కానీ గర్భిణులు రోజుకి 3.8గ్రాముల ఉప్పు మాత్రమే తీసుకోవాలంటున్నారు నిపుణులు. మరీ తప్పనిసరి పరిస్థితుల్లో అయితే 5.8గ్రాముల వరకు తీసుకోవచ్చు. దీని కంటే ఎక్కువగా తీసుకుంటే కాళ్లు, చేతుల వాపులు, తరచుగా మూత్రవిసర్జన, అధిక రక్తపోటు సమస్యలు వస్తాయని గైనకాలజిస్ట్‌లు చెబుతున్నారు.

News November 22, 2025

APPLY NOW: సింగరేణిలో 82 పోస్టులు

image

సింగరేణిలో 82 ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పోస్టులను ఇంటర్నల్ అభ్యర్థులతో భర్తీ చేయనున్నారు. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 24లోగా అప్లై చేసుకోవాలి. దరఖాస్తు హార్డ్ కాపీని ఈనెల 26లోగా పంపాలి. బేసిక్ శాలరీ నెలకు రూ.50,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: scclmines.com

News November 22, 2025

కులశేఖర పడి కథ మీకు తెలుసా..?

image

12 మంది ప్రసిద్ధ ఆళ్వార్లలో కులశేఖరాళ్వార్ ఒకరు. ఆయన కేరళను పాలించిన ఓ క్షత్రియ రాజు. ఆయన రాజు అయినప్పటికీ దాస్యభక్తికి ప్రతీకగా నిలిచాడు. మహావిష్ణువుపై అచంచల భక్తితో ‘పెరుమాళ్ తిరుమొళి’ అనే పాటలు రచించారు. ‘స్వామీ! నీ సన్నిధిలో కనీసం గడపగానైనా ఉండిపోవాలి’ అని కోరుకున్నారు. కోరుకున్నట్లే చివరకు ఆయన తిరుమల శ్రీవారి ఆలయంలో కులశేఖర పడిగా మారారనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. <<-se>>#VINAROBHAGYAMU<<>>