News April 3, 2025
NRPT: గ్రూప్ -1 ర్యాంకర్లను సన్మానించిన ఎండీ

నారాయణపేట ఆర్టీసీ డిపోలో పని చేస్తున్న కార్మికుల పిల్లలు ఇటీవల విడుదలైన గ్రూప్ -1 ఫలితాల్లో ప్రతిభ చూపారు. కండక్టర్ శ్రీనివాసులు కూతురు వీణ డిప్యూటీ కలెక్టర్గా, వహీద్ కూతురు ఫాతిమినా ఫైజ్ డీఎస్పీలుగా ఎంపికయ్యారు. వారిని ఆర్టీసీ సంస్థ ఎండీ సజ్జనార్ HYDలోని తన కార్యాలయంలో శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందించి అభినందించారు. తమ పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దిన పేరెంట్స్ను అభినందించారు.
Similar News
News November 2, 2025
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయండి: కలెక్టర్ ఇలా

వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సరైన తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని ఆమె స్పష్టం చేశారు. ఈ రోజు ఆమె తిప్పర్తి(M) చిన్న సూరారం గ్రామంలో ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
News November 1, 2025
సానుభూతితో ఓట్లు దండుకోవాలనేది BRS యత్నం: రేవంత్

TG: జూబ్లీహిల్స్లో సానుభూతితో ఓట్లు దండుకోవాలని BRS ప్రయత్నిస్తోందని CM రేవంత్ ఆరోపించారు. ‘2007లో PJR చనిపోతే ఏకగ్రీవం కాకుండా అభ్యర్థిని నిలబెట్టే సంప్రదాయానికి KCR తెరదీశారు. పదేళ్ల పాటు మైనార్టీ సమస్యలు పట్టించుకోలేదు. మా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి 70వేల ఉద్యోగాలిచ్చాం. ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెలిని ఇంటి నుంచి పంపిన KTR.. సునీతను బాగా చూసుకుంటారా?’ అని విమర్శించారు.
News November 1, 2025
KNR: అధ్యయనం చేస్తూ.. మెలుకువలు నేర్చుకుంటున్న విద్యార్థులు

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని బాబు జగ్జీవన్ రావు వ్యవసాయ కళాశాల ఫైనల్ ఇయర్ విద్యార్థులు శంకరపట్నం మొలంగూర్ ఇండస్ట్రియల్ ఏరియాలోని కావేరి సీడ్ ప్లాంట్ను సందర్శించారు. ఈ సందర్శనలో విత్తన ఉత్పత్తి, ప్రాసెసింగ్, ప్యాకింగ్, నాణ్యత, నిల్వ వంటి అంశాలపై విద్యార్థులు నేరుగా పరిశీలించి, మెలుకువలు నేర్చుకున్నారు. క్షేత్రస్థాయి పరిశోధనలు, శిక్షణలో భాగంగా ఈ సందర్శన జరిగిందని వారు తెలిపారు.


