News January 24, 2025
NRPT: చట్టాలపై విద్యార్థులకు అవగాహన అవసరం

జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని నారాయణపేట కస్తూర్బా గాంధీ పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్, జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ ఉమర్ మాట్లాడుతూ.. బాలికల హక్కులు, చట్టాలు, విద్యా హక్కు పై అవగాహన కల్పించారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు.
Similar News
News December 7, 2025
మహిళను హత్య చేసిన విజయనగరం వాసి

పెందుర్తిలోని సుజాతనగర్లో మహిళను కుర్చీతో కొట్టి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. శ్రీకాకుళానికి చెందిన దేవి, విజయనగరానికి చెందిన శ్రీనివాస్ సుజాతనగర్లో రూమ్ తీసుకుని సహజీవనం చేస్తున్నారు. ఇద్దరి మధ్య శనివారం రాత్రి వివాదం చోటుచేసుకోగా ఆమెను హత్య చేసి పరారయ్యాడు. ఈ ఘటనపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల శ్రీనివాస్ రైస్ పుల్లింగ్ కేసులో అరెస్ట్ అయినట్లు పోలీసులు తెలిపారు.
News December 7, 2025
2.46 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం: జేసీ

జిల్లాలో ఖరీఫ్ 2025-26 సీజన్ ధాన్యం సేకరణ కార్యక్రమాన్ని జిల్లాలో మొత్తం 287 రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేపట్టడం జరిగిందని జేసీ నవీన్ తెలిపారు. గత ఏడాది ఇదే రోజుకి 1,82,405 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా, ఈ సంవత్సరం ఇప్పటి వరకు 2,46,473 మెట్రిక్ టన్నులు RSKల ద్వారా సేకరించినట్లు తెలిపారు. మొత్తం 29,668 మంది రైతుల నుంచి ధాన్యాన్ని కొని 48 గంటల్లో నగదు జమ చేశామన్నారు.
News December 7, 2025
జనగామ: ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి: DCP

జనగామ జిల్లాలో మూడు విడతలుగా జరగబోయే ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని DCP రాజమహేంద్రనాయక్ తెలిపారు. ఈ సందర్భంగా DCP మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికలు, ఓటర్లను ప్రభావితం చేసేలా మద్యం, డబ్బు పంపిణీపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన వారితో పాటు గ్రూప్ అడ్మిన్‌పై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.


