News January 22, 2025
NRPT: జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల అవగాహన ర్యాలీ

జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల్లో భాగంగా బుధవారం నారాయణపేట జిల్లా కేంద్రంలో వివిధ శాఖల అధికారులు, పాఠశాల విద్యార్థులతో కలిసి కలెక్టర్ సిక్త పట్నాయక్, ఎస్పీ యోగేశ్ గౌతమ్ పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మినీ స్టేడియంలో సమావేశంలో SP యోగేశ్ గౌతమ్ మాట్లాడుతూ.. జిల్లాలో గత ఏడాది 250 వరకు రోడ్డు ప్రమాదాలు జరగాయని, అందులో 102 మంది చనిపోయారన్నారు. సమన్వయంతో ప్రమాదాలు నివారించాలన్నారు.
Similar News
News December 23, 2025
ANU CDE పరీక్షల షెడ్యూల్ విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో జనవరి 20వ తేదీ నుంచి ఫిబ్రవరి 19వ తేదీ వరకు సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు CDE సమన్వయకర్త రామచంద్రన్ తెలిపారు. UG, PG 1, 2, 3, 4, 5 సెమిస్టర్ల పరీక్షల షెడ్యూల్ విడుదల చేశామన్నారు. పూర్తి స్థాయి షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీలోని సంబంధిత అధికారులను సంప్రదించాలన్నారు.
News December 23, 2025
సిరిసిల్లలో పెరుగుతున్న రేప్ కేసులు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రేప్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత సంవత్సరం కంటే 55% పెరిగాయి. 2024లో 20 కేసులు నమోదు కాగా.. 2025 సంవత్సరంలో కేసుల సంఖ్య 31కి పెరిగింది. ఇంటర్నెట్‌లో అడల్ట్ కంటెంట్ సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మారుతున్న సమాజం పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని పోలీసుల సూచిస్తున్నారు.
News December 23, 2025
TDP-JSP అబద్ధాలు బయట పడ్డాయి: జగన్

AP: వైసీపీ హయాంలో AP బ్రాండ్ దెబ్బతిందంటూ TDP, JSP చెప్పింది అబద్ధమని తేలినట్లు Ex.CM జగన్ పేర్కొన్నారు. ‘AP బ్రాండ్, పెట్టుబడులు దెబ్బతిన్నాయని వారు ఆరోపించారు. కానీ RBI డేటా ప్రకారం 2019-24 మధ్య మాన్యుఫాక్చరింగ్‌లో సౌత్‌లో AP ఫస్ట్, దేశవ్యాప్తంగా ఐదోస్థానంలో ఉంది. ఇండస్ట్రీ సెక్టార్‌లో సౌత్‌లో ఫస్ట్, దేశంలో 8వ స్థానంలో నిలిచింది. దీనిని బ్రాండ్ దెబ్బతినడం అంటారా?’ అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.


