News January 22, 2025

NRPT: జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల అవగాహన ర్యాలీ

image

జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల్లో భాగంగా బుధవారం నారాయణపేట జిల్లా కేంద్రంలో వివిధ శాఖల అధికారులు, పాఠశాల విద్యార్థులతో కలిసి కలెక్టర్ సిక్త పట్నాయక్, ఎస్పీ యోగేశ్ గౌతమ్ పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మినీ స్టేడియంలో సమావేశంలో SP యోగేశ్ గౌతమ్ మాట్లాడుతూ.. జిల్లాలో గత ఏడాది 250 వరకు రోడ్డు ప్రమాదాలు జరగాయని, అందులో 102 మంది చనిపోయారన్నారు. సమన్వయంతో ప్రమాదాలు నివారించాలన్నారు.

Similar News

News February 18, 2025

KMR: టీచరే కీచకుడిగా మారాడు

image

గాంధారి మండలంలో సమాజం తలదించుకునే ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదైంది. SI ఆంజనేయులు వివరాలిలా.. మండలంలోని ప్రభుత్వ పాఠశాల టీచర్ రమేశ్ అదే పాఠశాలలో చదువుకునే విద్యార్థినిని సబ్జెక్టుకు సంబంధించిన విషయాలు ఫోన్లో చెబుతానని తల్లిదండ్రుల ఫోన్ నంబర్ తీసుకొని అసభ్యకర మెసేజ్‌లు చేశాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News February 18, 2025

బావ కోసం హెలికాప్టర్ ఏర్పాటు చేసిన బావమరిది!

image

బావమరిది బతుకగోరతాడని సామెత. బిహార్‌లోని వైశాలి ప్రాంతంలో ఓ బావమరిది తన సోదరి భర్త కోసం ఏకంగా హెలికాప్టర్ ఏర్పాటు చేశాడు. పెళ్లైన తర్వాత తొలిసారిగా అతడి సోదరి భర్తతో పుట్టింటికి వస్తుండటంతో వాళ్లు చాలా గ్రాండ్‌గా రావాలని పట్నా నుంచి వైశాలి వరకూ 30 కిలోమీటర్ల దూరం మేర హెలికాప్టర్‌లో తీసుకొచ్చాడు. ఈ వేడుకను తిలకించేందుకు స్థానికులు వారి ఇంటి వద్ద పెద్ద ఎత్తున గుమిగూడారు.

News February 18, 2025

కామారెడ్డి: హత్య చేశారా.. కాల్చి చంపారా

image

లింగంపెట్ మండలం భానాపూర్ అటవీ ప్రాంతంలో పోచయ్య(70) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి హత్య చేశారు. పోచయ్య స్వగ్రామం పిట్లం మండలంలోని బోలక్ పల్లి గ్రామంగా తెలుస్తుంది. కుటుంబ సభ్యులు పిట్లం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. హత్య చేసింది పరిచయస్తుడే అనే కోణంలో పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!